Hyderabad: మహిళపై అకారణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు..! స్వాతంత్రదినోత్సవం నాడే ఘటన..
కొందరు పోలీస్ యూనిఫామ్ ఒంటిపైకి రాగానే రెచ్చిపోతుంటారు. ప్రమోషన్ కోసం.. డబ్బుల కోసం అకృత్యాలకు పాల్పడుతుంటారు. తాజాగా స్వాతంత్ర దినోత్సవం నాడే ఓ మహిళ పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఎలాంటి కారణం లేకుండా ఓ మహిళను అరెస్ట్ చేసి.. రాత్రంతా స్టేషన్ లోనే ఉంచి తీవ్రంగా కొట్టారు. మరుసటి రోజు ఉదయం బాధితురాలిని విడిచి పెట్టారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతోన్నాయి.
హైదరాబాద్ లోని మీర్ పేట్ లోని నందిహిల్స్ వరలక్ష్మి అనే మహిళ నివాసిస్తోంది. ఇప్పుడు శ్రావణం మాసం కావడంతో తన కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. పెళ్లి డబ్బు అవసరమవుతాయని భావించి.. సరూర్ నగర్ లోని బంధువుల ఇంటికి డబ్బు కోసం వెళ్లింది. తిరిగి వస్తున్న వరలక్ష్మిని ఆగస్ట్ 15న ఎల్బీనగర్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించినా.. వారు సమాధానం చెప్పకుండా స్టేషన్ తరలించారు. ఓ మహిళా అని చూడకుండా దారుణంగా కొట్టారు. ఆమెపై థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించారు. అయితే ఈ విషయం ఓ ఉన్నతాధికారి తెలియడంతో ఆయన వెంటనే మహిళను విడిచిపెట్టాలని ఆదేశించారు. తీవ్ర గాయాలపాలైన వరలక్ష్మి అతికష్టమీద ఇంటికి చేరింది. ఇంట్లో వారికి జరిగిన విషయం చెప్పింది.
తాను ఏ తప్పు చేయకున్నా తీసుకెళ్లి దారుణంగా కొట్టారని బాధితురాలు బోరున విలపించింది. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. ఇప్పటికి సరిగా నడవలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన నాడే మహిళ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ ఘటనపై రాచకొండ సీపీ చౌహాన్ స్పందించారు. మహిళను అకారణంగా అరెస్ట్ చేసి థర్డి డిగ్రీ ప్రయోగించిన హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేశారు. అయితే వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీకోవాలని డిమాండ్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications