శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 41 కోట్ల హెరాయిన్ పట్టివేత, మహిళ అరెస్ట్
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. ఓ విదేశీ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ. 41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితురాలు జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు.
హెరాయిన్‌ను డాక్యుమెంట్ ఫోల్డర్‌లో దాచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అక్రమంగా బంగారం, డ్రగ్స్ తరలిస్తున్న క్రమంలో విమానాశ్రయాల్లో తనిఖీలను కట్టుదిట్టం చేశారు అధికారులు.
ఈ నేపథ్యంలోనే ప్రొఫైల్ ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నారు.

మరోవైపు, ముంబైలోనూ భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వెనిజులా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ. కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేశారు. డ్రగ్స్ అక్రమంగా రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వెనిజులా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా కొకైన్ బయటపడింది. అతడి బ్యాగ్‌లో 628 గ్రాముల 57 కొకైన్ క్యాప్సూల్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టబడిన కొకైన్ విలువ రూ. 6.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
బెంగళూరులో రూ. 26 కోట్ల కొకైన్ సీజ్
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తరలిస్తున్న 2.6 కిలోల కొకైన్‌ను కొకైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకెళుతున్న కెన్యా దేశానికి చెందిన 36 ఏళ్ల ఓ మహిళను అరెస్ట్ చేశారు. అధికారులకు సమాచారం అందడంతో విమానాశ్రయంలో తనిఖీలు చేసి పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications