double-decker bus:జనవరి నుంచి సిటీలో ట్రావెల్, ఎలక్ట్రిక్, ఏసీ బస్సుల్లో 60 సీట్లు

హైదరాబాద్‌ రోడ్లపై డబుల్ డెక్కర్ ఏసీ బస్సులు జనవరి నుంచి తిరగనున్నాయి. ఇవీ అన్ని ఎలక్ట్రిక్ అండ్ ఏసీ బస్సులు కావడం విశేషం. ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)ఆరు బస్సుల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది. ఆ బస్సులు రోజు 12 నుంచి 14 గంటల పాటు తిరుగుతాయి.

పటాన్ చెరు- కోటి, జీడిమెట్ల-సీబీఎస్, అఫ్జల్ గంజ్- మెహిదీపట్నం.. ఇతర రూట్లలో తిరుగుతాయి. ఆ బస్సులు రెండు సంవత్సరాలు.. రెండు లక్షల కిలోమీటర్లు తిరిగేవరకు వారంటీ ఉంటుంది. దీంతోపాటు వచ్చే ఐదేళ్లకు వార్షిక నిర్వహణ ఒప్పందం కూడా చేసుకుంటారు. డబుల్ డెక్కర్ బస్సులతో ట్రాఫిక్ జామ్ కాదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. తొలుత సెలక్టెడ్ ఏరియాలో ఆ బస్సులు తిరుగుతాయని వివరించారు.

Hyderabad to get double-decker AC buses in January

ఈ బస్సులో 60 సీట్లు ఉంటాయి. ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. అయితే భారీగా ఫ్లై ఓవర్ నిర్మించడం వల్ల వాటిని తొలగించారు. మళ్లీ ఇప్పుడు నడిపిస్తున్నారు.సిటీలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రారంభించాలనే ప్రతిపాదన గత ఏడాది వచ్చింది.

తాను పాఠశాలకు ఆ బస్సులోనే వెళ్లేవాడినని మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత సిటీలో డబుల్ డెక్కర్ బస్సులను నడపాలనే ప్రతిపాదన వచ్చి.. కార్యరూపం దాల్చింది. ఈ ప్రాజెక్టు సాధ్యసాధ్యాలను ఆర్టీసీకి చెందిన సంఘాలు పరిశీలిస్తున్నాయి. దాదాపు ఓకే అయ్యిందని.. తొలుత బస్సులు వచ్చే ఏడాది ప్రారంభం నుంచి తిరుగాయని తెలిసింది. ఏదీ ఏమైనప్పటికీ డబుల్ డెక్కర్ బస్సుల కోసం సిటీ జనం ఆసక్తిగా చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+