హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Encounter: ఇలాంటి ఎన్ కౌంటర్లు అత్యాచారాలను ఆపుతాయా?: గుత్తా జ్వాలా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వెటర్నరి డాక్టర్ దిశపై అత్యాచారానికి, హత్యకు ఒడిగట్టిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై ఒకవంక తెలంగాణ వ్యాప్తంగా, దేశం మొత్తమ్మీద హర్షాతిరేకాలు వ్యక్తమౌతుండగా, దీన్ని వ్యతిరేకించే వారూ లేకపోలేదు. ఇలాంటి ఎన్ కౌంటర్లు భవిష్యత్తులో మహిళలు, చిన్నపిల్లలు, అమ్మాయిలపై జరిగే అత్యాచారాలకు అడ్డుకట్ట వేస్తాయా? అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.

Recommended Video

Disha Issue : From President To Politicians And Sports Personalities & Celebrities | Oneindia Telugu

Disha Murder case: దిశ నిందితులకు బహిరంగ ఉరి తీయాలని, కాల్చి చంపాలని కోరలేను.. కానీ: కేటీఆర్Disha Murder case: దిశ నిందితులకు బహిరంగ ఉరి తీయాలని, కాల్చి చంపాలని కోరలేను.. కానీ: కేటీఆర్

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారినణి గుత్తా జ్వాలా పోలీసుల చర్యను తప్పు పట్టేలా కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. తన ట్వీట్ ద్వారా వారికి సూటిగా ప్రశ్నలు సంధించారు. వెటర్నరి డాక్టర్ దిశపై కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన సంఘటన.. భవిష్యత్తులో మహిళలను అత్యాచార ఉదంతాల నుంచి కాపాడుతుందా? అని నిలదీశారు. భవిష్యత్తులో ఇక రేపిస్టులు అనే వారే ఉండబోరా? అని ప్రశ్నించారు.

Hyderabadi shuttler Gutta Jwala questions Hyderabad police as Will this stop future rapists

ప్రతి రేపిస్టునూ ఇదే విధంగా శిక్ష విధిస్తారా? అని ప్రశ్నను గుత్తా జ్వాలా సంధించారు. సామాజిక పరంగా ఎదురయ్యే విమర్శలను గానీ, ఇంకే ప్రతిఘటనలను గానీ పట్టించుకోకుండా ఇక ముందు కూడా అత్యాచార నిందితులను ఇలా ఎన్ కౌంటర్లు చేస్తారా? అని ప్రశ్నించారు. అత్యాచారాలను ఆపడానికి నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పరిష్కారం చూపబోదని ఆమె పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఏడేళ్ల కిందట దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్భయ ఘటన తరువాత.. అత్యాచారాలు ఆగిపోయాయా? అని ఆమె పరోక్షంగా ప్రశ్నించారు.

English summary
As all the four men accused in the gang-rape and murder of a young veterinarian in Telangana were shot dead by the police on Friday, shuttler Jwala gutta raised a question that whether this action will stop people from committing such a heinous crime. "Will this stop the future rapists?? And an important question: will every rapist be treated the same way...irrespective of their social standing," Jwala tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X