హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ గెలుపు, డబ్బు ప్రవాహంపై కేసీఆర్ ఏమన్నారంటే? జాతీయ రాజకీయాలపై ఆసక్తికరవ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

KCR Press Meet : I will Participate In National Politics Says KCR | Oneindia Telugu

హైదరాబాద్: ఈ గెలుపు పూర్తిగా తెలంగాణ ప్రజల విజయమని కేసీఆర్ మంగళవారం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెరాస భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తెరాస భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రైతులు, మహిళలు అందరికీ థ్యాంక్స్ చెప్పారు. కార్యకర్తలు అహోరాత్రులు కష్టపడి పని చేశారని చెప్పారు. అందరూ ఎంతో కష్టపడ్డారన్నారు.

ఈ గెలుపుతో మనకు గర్వం, అహంకారం రావొద్దని చెప్పారు. తుది తీర్పు ప్రజలదేనని, వారు ఇచ్చిన తీర్పును గౌరవించి, మన బాధ్యతను నెరవేర్చాలని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరూ తెరాసను ఆదరించారని చెప్పారు. విజయానికి కారకులైన అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని, కోటి ఎకరాలు పచ్చబడాలని చెప్పారు.

నేను ప్రచారంలోనే చెప్పా

నేను ప్రచారంలోనే చెప్పా

తెరాసను గెలిపిస్తే కాళేశ్వరం, కూటమిని గెలిపిస్తే శనేశ్వరం అని ప్రచారం సమయంలో చెప్పానని, ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని కేసీఆర్ చెప్పారు. కాబట్టి కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ధనిక రైతులు తెలంగాణలో ఉన్నారనే విధంగా వారి కోసం పని చేస్తామని చెప్పారు. రైతులకు, గిరిజనులకు, గిరిజనేతల భూహక్కుల బాధ్యతలు నెరవేరుస్తామని చెప్పారు. ప్రజలు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తామని చెప్పారు.

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

ఈ విజయాన్ని అందించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కేసీఆర్ చెప్పారు. కులవృత్తులు కుదుటపడేలా చేస్తానని చెప్పారు. గెలిచామని మనం పొంగిపోవద్దని, అహంకారానికి వెళ్లవద్దని కేసీఆర్ కార్యకర్తలకు, నేతలకు సూచించారు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రికార్డ్ చేస్తామని చెప్పారు. ఉద్యోగ ఖాళీలు సాధ్యమైనంత వేగంగా భర్తీ చేస్తామని చెప్పారు. దళితులు, గిరిజనులు ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా బాధలు పడుతున్నారని, దానికి ముగింపు పలకాలని చెప్పారు.

అందరికీ న్యాయం

అందరికీ న్యాయం


పేదరికానికి కులం మతం లేదని కేసీఆర్ చెప్పారు. రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ కులస్తులు కూడా వచ్చి తమకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలని కోరారని చెప్పారు. అందరికీ భద్రతతో కూడిన భవిష్యత్తు ఇస్తామని చెప్పారు. రెడ్డి కార్పోరేషన్, వైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని, మైనార్టీలకు న్యాయం చేస్తామని చెప్పారు. సింగిల్ బూత్‌లో రీపోలింగ్ లేకుండా, ఎలాంటి దొమ్మిళ్లు లేకుండా ఎన్నికలు జరిగాయని, ఇది గర్వకారణమని చెప్పారు.

డబ్బు ప్రవాహంపై కేసీఆర్

డబ్బు ప్రవాహంపై కేసీఆర్

ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల సంఘానికి, సీఈవో రజత్ కుమార్‌కు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి దొమ్మిళ్లు, దోపిళ్లు లేకుండా ఎన్నికలు జరిగాయని చెప్పారు. కానీ డబ్బు ప్రవాహం కనిపించిందని, దానిని తొలగించేందుకు ఈసీ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ప్రధాని మోడీ నుంచి సోనియా గాంధీ, కేంద్రమంత్రుల వరకు ఎందరో వచ్చి ప్రచారం చేశారని, కానీ ప్రజలు ఇచ్చే తీర్పు ఇచ్చారని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతామని చెప్పారు. ఈ దేశంలో కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలన్నారు. ఇప్పుడు తెలంగాణ ఆ దిశగా దేశానికి దిక్సూచి అయిందని చెప్పారు. తమకు ఎవరూ బాస్‌లు లేరని, ఏజెంట్లు లేరని చెప్పారు. ప్రజలే తమకు బాస్‌లు అన్నారు. తాము జాతీ రాజకీయాల్లోకి కచ్చితంగా వెళ్తామని, కీలకంగా మారుతామన్నారు.

English summary
Telangana caretaker chief minister KCR press meet after winning in Telangana Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X