హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

10 గంటలకు నేను కూడా టీవీ చూస్తా.. కోమటిరెడ్డి, 37 నెలల భృతి అంటూ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రం అంతా ఒక్కటే చర్చ.. ఒక్కటే డిస్కషన్.. ఉదయం 10 ఎప్పుడూ అవుతుందా.. అసెంబ్లీ లైవ్ ఎప్పుడూ వస్తోంది.. అందులో కేసీఆర్ సార్ కనబడతారెమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తానని కేసీఆర్ విన్న వనపర్తి జిల్లా పర్యటనలో చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో తెలంగాణ సమాజం, నిరుద్యోగ యువత కళ్లకు వత్తులు కట్టుకొని మరీ ఉంది. వారే కాదు నేతలు కూడా ఎదురు చూస్తున్నారట. కేసీఆర్ ప్రకటనపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.

కోమటిరెడ్డి కూడా..

కోమటిరెడ్డి కూడా..

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి స్పందించారు. నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగుల‌ను చాలా కాలం నుంచి కేసీఆర్ మ‌భ్య‌పెడుతున్నార‌ని అన్నారు. ఇప్ప‌టికైనా కేసీఆర్‌కు అదే గుర్తుకు వ‌చ్చి నిరుద్యోగ భృతి అంశంపైనే ప్ర‌క‌ట‌న చేస్తార‌ని కోమ‌టిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రేపు నేను కూడా టీవీ చూస్తా. మీరు అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేయ‌గానే.. భువ‌న‌గిరి వెళ్లి అక్క‌డ మీకు పాలాభిషేకం చేస్తానని తెలిపారు. 2018 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో నిరుద్యోగుల‌కు రూ.3,116లు నిరుద్యోగ భృతి ఇస్తామ‌న్నారు. రాష్ట్రంలో 40 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారు.

మొత్తం 37 నెలలు

మొత్తం 37 నెలలు

37 నెల‌ల నిరుద్యోగ భృతి బ‌కాయిలు ఇస్తామ‌ని సీఎం ప్ర‌క‌టిస్తార‌ని ఆశిస్తున్నానని కోమటిరెడ్డి అన్నారు. ఖాళీగా ఉన్న 1.90 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు ఒకే ద‌ఫాలో నోటిఫికేష‌న్ ఇస్తార‌ని అనుకుంటున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేష‌న్ రాక చాలా మందికి వ‌యోప‌రిమితి దాటిపోయిందని చెప్పారు. అలాంటి వారికి వ‌యో ప‌రిమితి స‌డ‌లింపు ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంటార‌ని భావిస్తున్నానని కోమ‌టిరెడ్డి కామెంట్ చేశారు.

కాకరేపిన కామెంట్స్

కాకరేపిన కామెంట్స్

వనపర్తి జిల్లా నాగవరంలో భారీ బహిరంగ సభలో నిన్న సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నానని తెలిపారు. నిరుద్యోగులు అందరూ ఉదయం 10 గంటలకు టీవీ చూడాలని వెల్లడించారు. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారం అయిందో రేపు అసెంబ్లీలో చెప్పబోతున్నానని వివరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా ఉద్యమం చేపట్టి కొట్లాడామో అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే దేశం కోసం కూడా అలాగే పోరాడదామని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని ఉద్ఘాటించారు. వనపర్తి జిల్లా అవుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు వనపర్తి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వెల్లడించారు. గతంలో పాలమూరు జిల్లాలో పరిస్థితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవని అన్నారు.

English summary
iam also watching tv at 10 clock congress mp komatireddy venkat reddy said. yestaurday cm kcr suggested watching tv at 10 clock.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X