భారీగా ఐఏఎస్ బదిలీలు: సిరిసిల్ల కలెక్టర్ కూడా.. కారణం ఇదేనా..?
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లకు స్థానచలనం జరిగింది. వెయిటింగ్ లో ఉన్న అధికారులకు కూడా పోస్టింగులు ఇచ్చింది. ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 14 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది.
రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా జితిష్ వి పాటిల్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా కే నిఖిల, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా పి ఉదయ్ కుమార్, జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ గా వల్లూరు క్రాంతి, జనగామ జిల్లా కలెక్టర్ గా సీ హెచ్ శివలింగయ్య, వరంగల్ జిల్లా కలెక్టర్ గా బీ గోపి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా కే శశాంక నియమించింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్‌ను టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. డాక్టర్ ఏ.శరత్‌ను పంచాయితీరాజ్ శాఖ కమిషనర్‌గా, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా ఉన్న డీ.కృష్ణ భాస్కర్‌ను పరిశ్రమల శాఖ డైరక్టర్‌గా, ఎమ్ రఘునందన్‌ను అగ్రికల్చర్ అండ్ కోపరేషన్ సెక్రటరీగా, డాక్టర్ వీ.వెంకటేశ్వర్లు యూత్ సర్వీసెస్ డైరక్టర్‌గా, మహమ్మద్ అబ్ధుల్ అజీమ్‌ను మైనారిటీ సంక్షేమశాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది.

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ ప్రసాద్‌పై బదిలీ వేటు పడింది. ఆయన చక్కగా విధులు నిర్వర్తిస్తారనే పేరు ఉంది. ఇటీవల చాలా సందర్భాల్లో ఆయన పేరు వచ్చింది. జిల్లాలో గల తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇటీవల ఓ నర్సు డ్యాన్స్ చేశారు. బుల్లెట్ బండి సాంగ్‌పై స్వాతంత్ర దినోత్సవం రోజున చిందులేశారు. అదీ రచ్చ రచ్చ అయ్యింది. కలెక్టర్ మెమో కూడా జారీచేశారు. దీనిని తెలంగాణ సమాజం ఖండించింది. ఇండిపెండెన్స్ డే రోజు ఆటవిడుపు కోసం డ్యాన్స్ చేస్తే.. మెమో ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది.
Recommended Video
ఇదే విషయాన్ని అందరూ షేర్ చేశారు. ఇంకేముంది కలెక్టర్ కూడా దిగి వచ్చారు. మెమోను వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాతే కలెక్టర్ బదిలీ కావడం చర్చకు దారితీసింది. బుల్లెట్ బండి సాంగ్ గురించి అత్యుత్సాహం ప్రదర్శించారా..? లేదంటే మరో కారణం మీద బదిలీ చేశారనే అంశం హాట్ టాపిక్ అవుతోంది.












Click it and Unblock the Notifications