రైతులను పట్టించుకోకపోతే గద్దెదించేవరకూ పోరాడుతాం.!కేంద్ర బీజేపి విధానాలపై భగ్గుమన్న గులాబీ నేతలు.!
హైదరాబాద్ : రైతులు ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ రాష్ట్రంలో రైతు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు తెలంగాణ మంత్రులు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు కొట్టి, నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం కేంద్ర బీజేపి రైతు వ్యతిరేక విధానాలపైన గులాబీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు గులాబీ నేతలు.

కేంద్ర బీజేపి పై చావుడప్పు.. రోడ్ల మీద కదంతొక్కిన గులాబీ దళం..
మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనగా స్వయంగా డప్పు కొట్టి, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, లేనిపక్షంలో రైతుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం టిఆర్ఎస్ పార్టీ ఈ ఉద్యమాన్ని చేపట్టిందని, రైతు పండించిన పంట మొత్తం కొనుగోలు చేసేందుకు, గిట్టుబాటు ధర ఇచ్చేందుకు, రైతుకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని, దీనికి దేశంలో ఉన్న రైతు నాయకులు, రైతులు మద్దతు పలకాలని మంత్రి సత్యవతి కోరారు.

రైతుల మరణాలకు కేంద్రమే బాద్యత.. ప్రధాని రైతు వ్యతిరేకి అన్న గులాబీ నేతలు
ఈరోజు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా రోడ్లపై కూర్చోవడం దురదృష్టకరమన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఇదొక చీకటి రోజని, దీనికి కారణం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ అని మండిపడ్డారు. రైతు సమస్యలు తెలియని నాయకులు, బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి? వడ్లు ఎలా పండుతాయి? రైతు ఎంత కష్టపడితే ఈ వడ్లు వస్తాయి తెలువని నేతలు మనకు నాయకులుగా ఉండడం మన రైతుల దురదృష్టకరమని, బియ్యం ఏ గింజలో నుంచి వస్తాయని అడిగే నేతలు ఉండడం వల్లే నేడు దేశ వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని సత్యవతి ధ్వజమెత్తారు.

రైతుల నిరసనలతో చట్టాలను వెనక్కు తీసుకున్నారు.. తెలంగాణ రైతులు తగ్గేది లే అనాలంటున్న సత్యవతి
ఏడాది కాలం ఢిల్లీలో ధర్నా చేస్తే క్షమాపణలు చెప్పి, నల్ల చట్టాలు రద్దు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై చావు డప్పు కొడుతున్నారని అన్నారు. ఎందుకు ఈ దుస్థితి వచ్చిందో బీజేపీ నేతలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని సూచించారు. నిజంగా రైతు సమస్య తెలిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని, ఆహార భద్రత చట్టం కేంద్ర పరిధిలో ఉంటుందని, దేశంలో అందరికీ ఆహారం అందించే బాధ్యత కేంద్రానిదేనని హితవుపలికారు. రైతు పండించిన పంట ఎవరు కొనాలో సోయి లేనివారు రాష్ట్ర బిజేపి అధ్యక్షులు కావడం రైతు దురదృష్టకరమని బండి సంజయ్ పైన మండిపడ్డారు సత్యవతి రాథోడ్.

కేంద్రం మెడలి వంచాలి.. రైతులు అండగా ఉండాలని మంత్ర సత్యవతి పిలుపు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తామని చెప్పడం వారి బీజేపి నేతల అవివేకమని, ఇప్పటికైనా మేల్కొని వానాకాలం, యాసంగి పంటలు కొనాలని సూచించారు. గిట్టుబాటు ధర ఇస్తూ రైతులకు అండగా నిలవాలని, లేకపోతే కేంద్రం, బీజేపీ ప్రభుత్వ మెడలు వంచే వరకు టి.ఆర్.ఎస్ పార్టీ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు సత్యవతి రాథోడ్. టి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు, రైతు నాయకులు కలిసి రావాలని, పంజాబ్ రైతులు ఏడాదిగా నిరసన తెలిపితే గానీ మోదీ దిగి రాలేదని, అదేవిధంగా అవసరమైతే టి.ఆర్.ఎస్ పార్టీ రైతులకు అండగా ఎంత దూరమైనా, ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉందని కేంద్రాన్ని సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.
xరాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తామని చెప్పడం వారి బీజేపి నేతల అవివేకమని, ఇప్పటికైనా మేల్కొని వానాకాలం, యాసంగి పంటలు కొనాలని సూచించారు. గిట్టుబాటు ధర ఇస్తూ రైతులకు అండగా నిలవాలని, లేకపోతే కేంద్రం, బీజేపీ ప్రభుత్వ మెడలు వంచే వరకు టి.ఆర్.ఎస్ పార్టీ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు సత్యవతి రాథోడ్. టి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు, రైతు నాయకులు కలిసి రావాలని, పంజాబ్ రైతులు ఏడాదిగా నిరసన తెలిపితే గానీ మోదీ దిగి రాలేదని, అదేవిధంగా అవసరమైతే టి.ఆర్.ఎస్ పార్టీ రైతులకు అండగా ఎంత దూరమైనా, ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉందని కేంద్రాన్ని సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications