Hyderabad: దూసుకెళ్తోన్న హైడ్రా.. రంగనాథ్ పై ప్రశంసలు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజేన్సీ (హైడ్రా) ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హైడ్రాకు కమీషనర్ గా ఐపీఎస్ ఏవీ రంగనాథ్ ను కూడా నియమించారు. దీంతో ఆయన డైనమిక్ గా ముందుకెళ్తున్నారు.
ప్రభుత్వ భూముల అక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని హైడ్రా ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలపై కొరఢా ఝులిపిస్తున్నారు. హైడ్రా తాజాగా బాచుపల్లి ఎర్రకుంట పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను పడగొట్టారు. నగర శివారులో చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో హైడ్రా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం, దేవందర్‌నగర్‌లలో గతవారం అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.

329, 342 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన సుమారు 51 అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న, పరమేశ్వర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి నల్లచెరువును పరిశీలించారు. నల్ల చెరువులో కబ్జాలను, ఆక్రమణలు పూర్తిగా తొలగించడంతో పాటు చెరువు పరిరక్షిస్తామని రంగనాథ్ తెలిపారు. కాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ప్రశంసలు కురిపించారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి. "మంచి పని చేస్తున్నారు శభాష్ రంగనాథ్.. మరింత ముందుకు సాగండి" అని చెప్పారు.
మన ప్రజాప్రతినిధులు చాలా మంది దీనిని సహజంగా తీసుకొని అడ్డగోలుగా ప్రభుత్వ, చెరువు శిఖం భూములను ఆక్రమిస్తున్నారని అన్నారు. గత పాలకులు మేము తింటాము మీరు తినండి అని అందరిని దొంగలుగా మార్చరని తెలిపారు. లక్షల కోట్ల భూములను, ప్రాణాలను రక్షించే చెరువులను కాపాడుకోవాలని సూచించారు. మనం ట్రాన్స్ పరెంట్ గా ఉండడమే కాదు ఉన్నట్టు కూడా కనిపించాలని ఎక్స్ లో రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications