Bore Water: మూడు అడుగలకే ఉబికివచ్చిన నీరు.. టెంకాయతో అంతే మరీ.. చివరికి షాక్..!
ఈ మధ్య రైతులు బావులు తవ్వడం మానేసి బోర్లు వేస్తున్నారు. బావులు తవ్వితే ఎక్కువ ఖర్చు కావడంతో బోర్లు వేయడానికే మొగ్గు చూపుతున్నారు. అయితే ఎక్కడ నీరు ఉందో తెలుసుకోవాడనికి రైతులు కొబ్బరికాయతో నీరు చూసే వ్యక్తిని సంప్రదిస్తారు. అయితే వ్యవసాయ బోర్లకే కాదు.. ఇంటి వద్ద వేసుకునే బోర్లకు కూడా టెంకాయతో నీరు ఉందో లేదో తెసుకుని బోరు వేస్తారు. అయితే తాజాగా హైదరాబాద్ ఖైరతాబాద్ లో విచిత్ర ఘటన జరిగింది.
ఖైరతాబాద్ చింతలబస్తీలో కొద్ది రోజులుగా సామాజిక భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవనం నిర్మాణం ఈ మధ్యే పూర్తయింది. అయితే నీటి సమస్య ఉండడంతో స్థానిక నాయకులు ఎంపీ నిధులతో బోరు మంజూరు చేయించారు. దీంతో బోరు లారీ భవనం వద్దకు చేరుకుంది. అయితే బోరు వేసే ముందు ఎక్కడ వేస్తే నీరు వస్తుందో తెలుసుకోవాలని.. కొబ్బరి కాయతో నీటిని చూసే వ్యక్తిని పిలిపుంచారు. బోరు వేయడానికి భవనంలో చోటు లేదు.

దీంతో రోడ్డు పక్కకు బోరు వేయాలని నిర్ణయించారు. టెంకాయ చేతిలో పట్టుకుని చూడగా ఓ ప్రదేశంలో నీరు ఉన్నట్లు తెలిసింది. దీంతో స్థానిక నాయకులు అక్కడ పూజ చేసి బోరు వేయిడం ప్రారంభించారు. బోరు మూడు అడుగులు వేయగానే నీరు ఉబికి వచ్చింది. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. అయితే అస్సలు విషయం తెలిసి ఉసురుమన్నారు. వారు బోరు వేసింది.. వాటర్ లైన్ పైన అని తెలిసింది.

ఆ తర్వాత దానికి కొంత దూరంలో బోరు వేశారు. అక్కడ 40 అడుగులకే నీరు వచ్చింది. అయితే ఆ ప్రదేశాన్ని జలమండలి అధికారులు పరిశీలించి తవ్వకాలు చేపట్టగా పది అంగళాల పైప్ లైన్ కనిపించింది. ఈ పైప్ లైన్ ను 50 ఏళ్ల వేసినట్లుగా తెలిసింది. పైప్ లైన్ పై బోరు వేయడంతో పైప్ లైన్ రెండుగా చీలింది. అధికారులు తిరిగి పైప్ లైన్ ను అతికించారు. యూ ఆకారంలో పైప్ లైన్ ను పునరుద్ధరించారు.












Click it and Unblock the Notifications