Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూడేళ్లలో శంషాబాద్ వరకు మెట్రో, సిటీ రూపురేఖలు మారిపోతున్నాయి: కేటీఆర్

హైదరాబాద్: రాజధాని నగరం రోజు రోజుకీ మరింతగా విస్తరిస్తోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో జీహెచ్ఎంసీ పరిధిలోని 25, హెచ్ఎండీఏ పరిధిలోని 25 చెరువులు అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు సిద్ధమయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న వివిధ నిర్మాణ రంగ సంస్థల ప్రతినిదులకు ఒప్పంద పత్రాలను కేటీఆర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని 185 చెరువుల అభివృద్ధిలో క్రెడాయ్ ను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ రంగంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. నగరంలోని నీటి అవసరాలు, సుందరీకరణ లక్ష్యంతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు.

In Next 3 years will complete Metro line till shamshabad: KTR

నిర్మాణ రంగంతోపాటు ఫార్మా, పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు కేటీఆర్. దేశంలోనే అతిపెద్ద నగరాభివృద్ధి సంస్థగా హైదరాబాద్ ఎదిగిందని.. ఓఆర్ఆర్ వెలుపల కూడా భారీగా విస్తరిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 110 చెరువులు ఉన్నాయి. హైదరాబాద్‌లో పడిన వర్షం నీరు 94 శాతం మూసీలోకే వెళ్తుందని కేటీఆర్ తెలిపారు. జులై నాటికి హైదరాబాద్‌లో వంద శాతం మురుగునీరు శుద్ధి చేస్తామన్నారు. దేశంలోనే వందశాతం మురుగునీటి శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్ నిలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్.

హైద‌రాబాద్ రూపురేఖ‌లు మారిపోయాయ‌ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ ప‌రిధిలో 155 చెరువులు ఉన్నాయి. దుర్గం చెరువు అభివృద్ధి చెందిన త‌ర్వాత టూరిస్టులు అధికంగా వ‌స్తున్నారు. సినిమా షూటింగ్‌లు కూడా చాలా అయ్యాయయని తెలిపారు. ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్లో దేశంలోనే హైదరాబాద్ నెంబర్ వన్‌‌గా నిలిచిందని కేటీఆర్ చెప్పారు.

ఇక రెండు మూడేళ్లలో శంషాబాద్ వరకు మెట్రో లైన్ పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. లక్డీకపూల్-బీహెచ్ఈఎల్, నాగోల్-ఎల్బీనగర్ రూట్లలో మెట్రోకు కేంద్రం సాయం కోరామని.. అయితే, ఆ రెండు రూట్లలో ఫీజిబులిటీ లేదని కేంద్రం లేఖ రాసిందని మండిపడ్డారు. కేంద్రానికి మన రాష్ట్రం నుంచి భారీ మొత్తం పన్నుల రూపంలో వెళ్తున్నా.. వచ్చేది మాత్రం తక్కువేనని అన్నారు. యూపీ లాంటి రాష్ట్రాలకు మెట్రోలు ఇస్తున్నారన్నారు. హైదరాబాద్ లో మెట్రో లైన్ 250 కిలోమీటర్లకు విస్తరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చూసిన అభివృద్ధి గోరంత.. చేయాల్సింది చాలా ఉందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+