సంచలన నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే
సాధారణంగా రైలుకు ఇంజన్ తర్వాత ఒకటి లేదంటే రెండు, అలాగే చివరలో ఒక జనరల్ బోగీ ఉంటుంది. రిజర్వేషన్ బోగీల్లో ఆహార పదార్థాలు అమ్మకానికి వస్తుంటాయి. జనరల్ బోగీల్లోని ప్రయాణికుల గురించి ఎవరూ పట్టించుకోరు. ఏ స్టేషన్ లో ఎక్కడ అందుబాటులో ఉంటే దాన్ని ఈ బోగీలో ప్రయాణించేవారు కొనుగోలు చేస్తుంటారు. ఆహారం విషయంలో వీరికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇండియన్ రైల్వే ఎకానమీ మీల్స్ ను ప్రవేశపెట్టింది. దీనికింద రూ.20, రూ.50 ధరల్లో ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు.
ప్రతి రైల్వే స్టేషన్ లో జనరల్ బోగీలు ఎక్కడెక్కడ ఆగుతాయో గమనించి వారికి అందుబాటులో ఉండేలా ఎకానమీ మీల్స్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో 150 కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 12 స్టేషన్ల పరిధిలో 23 కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల నుంచి లభించే ఆదరణను బట్టి కౌంటర్లను ఇంకా పెంచుతామని అధికారులు తెలిపారు.

హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాల, డోన్, నంద్యాల, పూర్ణ, ఔరంగాబాద్ స్టేషన్లలో వీటిని అందుబాటులోకి తెచ్చారు. రూ.20 కు భోజనంతోపాటు రూ.50 ప్యాకెట్లలో స్నాక్స్ కూడా అందిస్తారు. ఐఆర్సీటీసీ కిచెన్ల నుంచి వీటిని తయారు చేస్తారు. అక్కడి నుంచే ఆయా కౌంటర్లకు చేరవేస్తారు. ప్రయాణికుల నుంచి లభించే ఆదరణను బట్టి వీటిని మరిన్ని స్టేషన్లకు విస్తరిస్తారు. జనరల్ బోగీల్లో ప్రయాణికులకు ఎదురవుతున్న ఆహార ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలంటూ ఎప్పటినుంచో రైల్వేకు విన్నపాలు వస్తున్నాయి. చివరకు ఎకానమీ మీల్స్ తీసుకురావడంద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లైందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications