• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రవి ప్రకాశ్ అరెస్టు వెనక అదే అసలు కారణమా..? కక్ష సాధింపు రాజకీయాలకు బలైనట్టేనా..?

|

హైదరాబాద్ : తెలుగు మీడియా రంగాన్ని సమూలంగా మార్చేసి, మీడియా స్థాయిని పటిష్టం చేసి, డాషింగ్ జర్నలిజానికి ఆజ్యం పోసిన రవిప్రకాష్ చుట్టూ ప్రస్తుతం చీకట్లు అలుముకుంటున్నాయి. ప్రజా స్వామ్యానికి నాలుగో స్తంభమైన పాత్రికేయ వృత్తిలో ఉన్న రవిప్రకాశ్ సమకాలీన రాజకీయాల్లో సమిధలా మారిపోయినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో ఎన్నో ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన కుంభకోణాలకు వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, కొన్ని సందర్బాల్లో రాజకీయ నేతలకే కాకుండా కార్పోరేట్ సర్కిల్స్ లో కొరకరాని కొయ్యగా మారిపోయారు రవిప్రకాశ్. సరిగ్గా ఇక్కడే రవిప్రకాశ్ టార్గెట్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా కొంత మంది రాజకీయ నేతలతో స్నేహం కూడా రవిప్రకాశ్ కు శరాఘాతంగా పరిణమించినట్టు చర్చ జరుగుతోంది.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్ట్, చంచల్‌గూడ జైలుకు తరలింపు

జైలు పాలైన రవి ప్రకాశ్.. కక్ష్య పూరిత రాజకీయాలే కారణమా..

జైలు పాలైన రవి ప్రకాశ్.. కక్ష్య పూరిత రాజకీయాలే కారణమా..

మీడియా రంగం అన్న తర్వాత స్నేహితులు ఎంత మంది ఉంటారో శత్రువులు కూడా అదే స్థాయిలో తెర వెనుక ఆటోమేటిక్ గా శత్రుత్వాన్ని పెంచుకుంటారన్న సత్యం రవిప్రకాశ్ అంశంలో మరోసారి రుజువైంది. మీడియాను నలుగురిలోకి తీసుకెళ్లి, నాలుగు కాలాల పాటు డైనమిక్ గా నడిపించేందుకు నలుగురు డైనమిక్ రాజకీయ నేతలతో నాలుగు ప్రత్యేక ఇంటర్వ్యూలు, చిట్ చాట్ లు ఎంతో అవసరం. నిజానికి మీడియా రేటింగ్ కూడా అక్కడే రెట్టింపవుతుంది. మీడియా రంగంలో ప్రత్యర్దికి అక్కడే సరైన పోటీ ఇవ్వవగలమనేది చాలా సార్లు రుజువైన అంశం. సరిగ్గా ఇందుకోసం అడుగులు వేసిన రవిప్రకాశ్ కు మొదట్లో అంతా బాగానే అనిపించినా తర్వాత వైరివర్గం విపరీతంగా పెరిగిపోయిందన్న అంశం ఆలస్యంగా గ్రహించినట్టు తెలుస్తోంది.

 మీడియాపై రాజకీయాల ప్రభావం.. ఆదిపత్యం కోసం ఆరాటం..

మీడియాపై రాజకీయాల ప్రభావం.. ఆదిపత్యం కోసం ఆరాటం..

మీడియా రంగంలో టీవి9 అప్రతిహతంగా కొనసాగేందుకు కృషి చేసిన రవిప్రకాశ్ ను కొత్త యాజమాన్యం ఆయనను ఉద్వాసన పలకడంతో పాటు, ఏకంగా నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, మోసం తదితర కేసులను నమోదు చేసింది. దీంతో రవి ప్రకాశ్ ఒక్కసారిగా షాక్ కు గురైనంత పనైంది. ప్రభుత్వాలు మారినప్పుడు కక్ష్యపూరిత రాజకీయాలు వెలుగు చూడటం సర్వ సాధారణం. కాని అవే రాజకీయాలు మీడియాను శాసించడం అరుదుగా జరుగుతుంటుంది. రవి ప్రకాశ్ అంశంలో అచ్చం ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. రవిప్రకాశ్ ను టీఆర్ఎస్ సర్కారు మొదట్లో అరెస్ట్ చేయలేదు. పోలీస్ స్టేషన్ కు పిలిపించి, విచారించి రవి ప్రకాశ్ ధోరణి మారకపోతే తీవ్ర పరిణామంలుటాయని హెచ్చరించింది.

 రవిప్రకాశ్ ఏ కేసులో అరెస్టు అయ్యారు..? స్పష్టత లేని కేసులు..

రవిప్రకాశ్ ఏ కేసులో అరెస్టు అయ్యారు..? స్పష్టత లేని కేసులు..

అంతే.. అనవసర కేసుల్లో ఇరుక్కుకున్నానన్న భావనతో రవిప్రకాశ్ కూడా సంయమనంగా ఉండిపోయారు. అంత వరకు కథ బాగానే ఉన్నా హుజూర్ నగర్ ఉప ఎన్నిక రవిప్రకాశ్ కేసును మళ్లీ మొదటికి తెచ్చినట్టు తెలుస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి మళ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. అందరి దృష్టి రేవంత్ మీద కేంద్రీకరించారు. సరిగ్గా ఇదే సమయంలో రేవంత్ రెడ్డి బృందానికి సాయం అందించేందుకు రవి ప్రకాశ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి ప్రసంగాలను సిద్ధం చేయడంతో పాటుగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ లోనూ కీలక భూమిక పోషించడం మొదలుపెట్టినట్టు రవిప్రకాశ్ పైన ప్రచారం జరుగుతోంది.

 రాజకీయ నేతలతో స్నేహం ప్రమాదమేనా..? రవి ప్రకాశ్ అంశంలో అదే జరిగిందా..?

రాజకీయ నేతలతో స్నేహం ప్రమాదమేనా..? రవి ప్రకాశ్ అంశంలో అదే జరిగిందా..?

ఇదే అంశం నేరుగా టీఆర్ఎస్ పెద్దలకు తెలిసి వారు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఫోర్జరీ, మోసం తదితర కేసులున్నప్పుడు కూడా అరెస్ట్ కాని రవిప్రకాశ్ మొన్న ఉన్నట్టుండి అరెస్ట్ అయ్యారు. టీవీ 9 వివాదం సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులను అడ్డుకున్నారన్న ఓ చిన్న కేసును కారణంగా చూపుతూ టీఆర్ఎస్ సర్కారు రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసినట్టు చర్చ జరుగుతోంది. రవిప్రకాశ్ అరెస్ట్ టీవీ9 ప్రమేయం కాకుండా రేవంత్ రెడ్డికి సాయం చేసినందుకే అరెస్ట్ అయిపోయారన్న విశ్లేషణలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయాయి.

 రూటు మారిన రాజకీయం.. నైతిక విలువలపై ఉక్కు పాదమేనా..?

రూటు మారిన రాజకీయం.. నైతిక విలువలపై ఉక్కు పాదమేనా..?

తమకు కొరకరాని కొయ్యగా మారి ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్న రేవంత్ రెడ్డికి ఎవరు సాయం చేసినా ఇలాంటి గతే పడుతుందన్న సంకేతాలను ఇవ్వడానికే టీఆర్ఎస్ ప్రభుత్వం రవిని అరెస్ట్ చేసినట్టు చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి తో స్నేహం చేయడానికి ఆసక్తి చూపేవారందరికి ఇదే గతి తప్పదనే అభిప్రాయలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పరిణామాలు ఇంత కక్ష్య పూరితంగా మారిణ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, రవి ప్రకాష్ ను జైలుకు వెళ్లి పరిమర్శించి రావండం కొసమెరుపు.

English summary
Ravi Prakash has been promoting the role of the Congress social media wing in the Huzurnagar by election, along with preparing speeches for revant Reddy. It seems to be the same reason for Ravi Prakash's arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more