అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్సులు చేయిస్తాడు.. ఆ తర్వాత డాక్టర్లతో సెక్స్‌కు ఉసిగొల్పుతాడు..

అతని పేరు ప్రసాద్. ప్రముఖ ఫార్మా కంపెనీకి ప్రతినిధినని చెప్పుకుంటాడు. కంపెనీ సేల్స్ పెంచుకోడానికి అందమైన అమ్మాయిలను పావులుగా వాడుకుంటాడు. డాక్టర్లు, సేల్స్ విభాగం ముఖ్య ఉద్యోగుల ముందు.. అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్సులు చేయిస్తాడు.. ఆ తర్వాత వాళ్లను సెక్స్ కు ఉసిగొల్పుతాడు. కొన్నాళ్లపాటు గుట్టుగా సాగిన ఇతని లీలలు ఇటీవలే బట్టబయలయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జూబ్లీహిల్స్ రేవ్ పార్టీ కేసులో ప్రధాని నిందితుడు ప్రసాద్ ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

ప్రసాదే చేయించాడు..

ప్రసాదే చేయించాడు..

జూబ్లీ హిల్స్ డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 12న జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 10లోని ఎఫ్ఏఐ పబ్ లో వెలుగు చూసిన రేవ్ పార్టీ కేసులో ప్రసాద్, శ్రీనివాస్ నాయుడు అనే ఇద్దరిని నిర్వాహకులుగా పోలీసులు గుర్తించారు. ఏపీతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన అందమైన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు, డాక్టర్లతో ఇంతరత్రా వ్యవహారాలు చేయించేందుకు ప్రత్నించారు. రేవ్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ ప్రసాదే చేయించాడని డీసీపీ చెప్పారు.

పరారీలో మరో ముగ్గురు

పరారీలో మరో ముగ్గురు


రేవ్ పార్టీ కేసులో ప్రసాద్, శ్రీనివాస్ నాయుడు, పబ్బు యజమాని సంతోష్ రెడ్డి, మేనేజర్ భరత్, మరో ఇద్దరి కోసం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చెందిన రెండు పోలీస్ టీమ్ లు ముగ్గరంగా గాలించాయి. ఎట్టకేలకు శుక్రవారంనాటికి ప్రసాద్ తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశామని, పబ్బు యజమాని, మేనేజర్ ఇంకా పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు ముమ్మరం చేశామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

అమ్మాయిలను వదిలేశాం..

అమ్మాయిలను వదిలేశాం..

కాగా, జూబ్లీ హిల్స్ రేవ్ పార్టీలో పోలీసులకు చిక్కిన 21 మంది అమ్మాయిలకు సంబంధించి కూడా డీసీపీ వివరణ ఇచ్చారు. ‘‘ఆ 21 మంది అమ్మాయిలను బాధితులుగా గుర్తించాం. వాళ్లు నేరుగా నేరానికి పాల్పడినట్లు ఆధారాలేవీ లేవు. అయితే కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాతే వాళ్లను విడిచిపెట్టాం''అని చెప్పారు.

మోదీ వార్నింగ్

మోదీ వార్నింగ్


జూబ్లీ హిల్స్ పబ్బులో రేవ్ పార్టీ నిర్వహించింది ప్రముఖ ఫార్మా కంపెనీ అని తెలియడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైంది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన రెండ్రోజుల తర్వాత.. ప్రధాని నరేంద్ర మోదీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకోడానికి డాక్టర్లు, ఇతర అధికారులకు లంచాలు, ప్రలోభాలు ఎరచూపించడం సరికాదని, అలా చేసినవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 పబ్బులో ఏం జరిగినా..

పబ్బులో ఏం జరిగినా..


సాధారణంగా సిటీ శివారులోని ఫాం హౌజుల్లో అప్పుడప్పుడూ వెలుగుచూసే రేవ్ పార్టీలు ఈసారి సిటీ నడిబొడ్డులోనే జరగడంతో హైదరాబాద్ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. పబ్బుల్లో రేవ్ పార్టీలు, అశ్లీల డ్యాన్సులకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పబ్బుల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా దానికి యజమానులే బాధ్యత వహించాల్సిఉంటుందని జూబ్లీహిల్స్ డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+