కేఏ పాల్ మళ్లీ వేశాడు.. ఈ సారి కూడా టార్గెట్ టీఆర్ఎస్, ప్లెక్సీలపై పిల్
కేఏ పాల్.. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు. శాంతిదూతగా చెప్పుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టేవాడినని అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ చేసేవారు. ఈ మధ్య తెలంగాణను డెవలప్ చేశానని అన్నారు. ఇవాళ టీఆర్ఎస్ ప్లీనరీ కోసం ఏర్పాటు చేసిన ప్లెక్సీలపై విరుచుకుపడ్డారు. సిటీ మొత్తం గులాబీమయంగా మారింది. దీనిపై పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లెక్సీలు, కటౌట్ పెట్టడానికి నియమ, నిబంధనలు వర్తించవ అని అడిగారు.

హైకోర్టులో పిల్..
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా సిటీలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, జెండాలను ఏర్పాటు చేసింది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు దర్శనం ఇస్తున్నాయి. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ప్లీనరీ కోసం సిటీ వ్యాప్తంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై పిటిషన్‌లో ప్రశ్నించారు. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, GHMC కమిషనర్ లను ప్రతివాదులుగా చేర్చారు.

ప్లెక్సీ వద్దన్నారు కదా..
ఫ్లెక్సీలు పెట్టొద్దని ప్రభుత్వంలో గతంలో చెప్పిన విషయాన్ని పాల్ ప్రస్తావించారు. నేతలు, కార్యకర్తలు భారీగా ప్లేక్సీలు ఏర్పాటు చేశారని, రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్‌లో వెల్లడించారు. సిటీ అంతా ఫ్లెక్సీలే ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. క్లాసిఫైడ్స్ తో ప్రచారం చేస్కోవడం తప్పు కాదని, కానీ రోడ్డు మధ్యలో ఫ్లెక్సీలు పెట్టడం తప్పని కేఏ పాల్ అంటున్నారు.

3 వేల మంది హాజరు...
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. HICC వేదికగా ప్లీనరీ జరుగుతోంది. ప్లీనరీకి ఆహ్వానం అందిన 3 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరికి బార్ కోడ్ తో ఐడీ కార్డులు, వాహనాలకు ప్రత్యేకంగా పాస్ లను జారీ చేసింది. ఉదయం 11 గంటలకు పార్టీ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ జరగనుంది. దేశంలోని దిగువ, మధ్య తరగతి పేదల గుండె చప్పుడు విన్పించే విధంగా పార్టీ విధానాలను, తీర్మానాలను రూపొందించామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

మిగతా రాష్ట్రాల్లో..
అన్ని రాష్ట్రాల్లో టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామాలు, 3 వేలకు పైగా వార్డుల పరిధిలో జెండాలు ఎగరవేశారు. ఇక గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో .. దేశ్ కీ నేతా కేసీఆర్ అని కీర్తిస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులను ఏర్పాటు చేశారు. ప్లీనరీ కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీలో 33 రకాల వంటకాలతో మోనూ సిద్ధం చేశారు.












Click it and Unblock the Notifications