Padi Koushik Reddy: ఆంధ్రవారిని సెటిలర్స్ అంటారా.. కౌశిక్ రెడ్డిపై కమ్మ రాజకీయ ఐక్య వేదిక ఆగ్రహం..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని డిఫెన్స్ లోకి నెట్టాయి. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. తాను లోకల్ అని.. ఎక్కడి నుంచో బతుకొచ్చిన నువ్వు తనకు సవాల్ విసురుతావా అని ప్రశ్నించారు. ఆంధ్రా సెటిలర్లు ఆంధ్రవారిని ఉద్దేశించి మాట్లాడారు. దీనిపై కమ్మ రాజకీయ ఐక్య వేదిక స్పందించింది. ఆంధ్రా సెటిలర్లు అనే కామెంట్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆయన క్షమాపణ చెప్పాలని తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ కోరారు.
ప్రజా ప్రతినిధుల మధ్య తలెత్తిన విభేదాల్లో ప్రజలను లాగడం సరైంది కాదన్నారు. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదంలోకి ఆంధ్రవారిని ఎందుకు లాగుతున్నారని అడిగారు. వ్యక్తిగత రాజకీయ విభేదాలను తమపై హైదరాబాద్ లో సెటిలైన ఆంధ్రవారిపై రుద్దుడం కరెక్టు కాదన్నారు. సెటిలర్స్అనే పదాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వివరించారు. తెలంగాణలో బతుకుతున్న ఆంధ్ర ప్రజలంతా తెలంగాణవారితో అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నామని పేర్కొన్నారు.

రాజకీయ లబ్ధికోసం సెంటిలర్స్ అంటూ రెచ్చగొట్టడం మంచిది కాదని హితవు పలికారు. కౌశిక్ రెడ్డి చెబుతున్న ప్రకారం హైదరాబాద్ లో కోటి పది లక్షల జనాభా ఉంటే వారిలో 80 లక్షల మంది సెటిలర్సే ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారంతా ఇక్కడి వారేనని పేర్కొన్నారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజల మధ్య వైషమ్యాలు, ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తారా? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో గ్రేటర్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారు.
మిగతా ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి ఇష్యూపై మాట్లాడడం లేదు. కాగా శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కౌశిక్ రెడ్డిని పరామర్శించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థిస్తున్నారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications