దీక్షా దివస్: 13 ఏళ్ల క్రితం కేసీఆర్ దీక్ష, కేంద్రంలో కదలిక, కేటీఆర్ ట్వీట్
దీక్షా దివస్.. మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టం. ఉద్యమ నేత కేసీఆర్ 2009 నవంబర్ 29వ తేదీన దీక్ష చేపట్టారు. 10 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. 11వరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసింది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అని అప్పట్లో నినాదం ఇచ్చారు. ఆనాటి ఉద్యమాన్ని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ పోరాటాన్ని స్మరిస్తూ ట్వీట్ చేశారు.
మలిదశ ఉద్యమం
తెలంగాణ రాష్ట్ర సమతి వ్యవస్థాపకుడు కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించారు. 2009, నవంబరు 29వ తేదీన ఆమరణ దీక్ష చేపట్టారు. కరీంనగర్‌లో గల ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్ధిపేట వద్ద గల రంగధాంపల్లిలో గల దీక్షా స్థలం వద్దకి బయల్దేరారు. అయితే కేసీఆర్ వాహనాన్ని మానేరు బ్రిడ్జ్ సమీపంలో గల అల్గునూరు చౌరస్తాలో పోలీసు బలగాలు, రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు చుట్టుముట్టారు. వాహనం నుంచి బలవంతంగా దించివేశారు. అయినప్పటికీ రోడ్డుమీదే ధర్నా చేశారు. అక్కడినుంచి ఖమ్మం జైలుకు తరలించినా.. జైలులోనే దీక్షను ప్రారంభించారు.

ఉద్యమం లేకున్నా..
డిసెంబరు 1వ తేదీన తాను లేకున్నా ఉద్యమం జరగాలి అని కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆ మరునాడు పార్లమెంట్‌లో ఎల్కే అద్వానీ దీక్ష గురించి ప్రస్తావించారు. ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 3వ తేదీన కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. 4వ తేదీన తెలంగాణ వస్తే జైత్రయాత్ర లేదంటే శవయాత్ర అని కేసీఆర్ ప్రకటించాడు. 5వ తేదీన వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ఎంపీలు కలిసి దీక్ష విరమించాలని కోరారు. అయినప్పటికీ కేసీఆర్ నిరాకరించారు. 6వ తేదీన అసెంబ్లీలో 14ఎఫ్ రద్దు చేస్తూ తీర్మానం చేశారు.

నిరసనలు..
కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తోందనే సమాచారంతో రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు వచ్చాయి. ఎటు చూసినా జై తెలంగాణ నినాదమే వినిపించింది. వరుస బంద్‌లతో బస్సులు, రైలు సేవలు స్తంభించిపోయాయి. లాయర్లు, ఇంజినీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నాలుగున్నర కోట్లమంది ఒక్కటయ్యారు. డిసెంబరు 7వ తేదీన అప్పటి సీఎం అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నిపార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. 8వ తేదీన తెలంగాణ దిశగా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు.

కోర్ కమిటీ సమావేశం
డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ కోర్ కమిటీ ఐదుసార్లు సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు ప్రకటన చేసింది. కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. 11 రోజుల సుధీర్ఘ దీక్షతో తెలంగాణకు ఏకం సిన కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తరువాత ఆమరణ దీక్షను విరమించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుచేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications