Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశం అసహ్యించుకునే రీతిలో కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా.!కవిత తెలంగాణకే తలవంపులు తెచ్చిందన్న బండి.!

ఖానాపూర్/హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని తలదించుకునే దుస్థితికి తీసుకొచ్చిందని బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపి ప్రజా సంగ్రామ యాత్రతో సీఎం చంద్రశేఖర్ రావుకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేసారు. ప్రజలకిచ్చిన హామీల అమలుకు నిధులు లేవని, ప్రజాధనాన్ని లూటీ చేసి లక్ష కోట్లతో దొంగ సారా దందా చేస్తారా?అని నిలదీసారు. దేశమంతా చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని చూసి అసహ్యించుకుంటోందని,
తెలంగాణ తలదించుకునే దుస్థితికి తీసుకొచ్చారని బండి సంజయ్ ఖానాపూర్ ప్రజా సంగ్రామ యాత్ర సందర్బంగా నిర్వహించిన సభలో స్పష్టం చేసారు.

 ఖానాపూర్ లో కదం తొక్కిన కాషాయదళం.. ఉత్సాహాన్ని నింపిన బండి సంజయ్ ప్రసంగం

ఖానాపూర్ లో కదం తొక్కిన కాషాయదళం.. ఉత్సాహాన్ని నింపిన బండి సంజయ్ ప్రసంగం


బిడ్డను సీబీఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని సీఎం చంద్రశేఖర్ రావు కుట్ర చేస్తున్నాడని బండి ఆరోపించారు. ఖానాపూర్ లో పాదయాత్ర సందర్బంగా ఏర్పాటు చేసి బహిరంగ సభలో సంజయ్ ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఖానాపూర్ లోని పెండింగ్ ప్రాజెక్టులు, బ్రిడ్జీలన్నీ పూర్తి చేస్తామన్నారు. డిగ్రీ కాలేజీ, రెవిన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యే అవినీతి అనకొండ అని, పాన్ షాపు నుండి పరిశ్రమల దాకా కమీషన్లు దండుకుంటారని ధ్వజమెత్తారు. వడ్ల కొనుగోలు పైసలన్నీ మోదీ ప్రభుత్వం ఇస్తుంటే, తాలు పేరుతో టీఆర్ఎస్ నేతలు రైతులను ఘోరంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

 లక్ష కోట్లతో దొంగ సారా దందా.. కవిత బుక్కయ్యిందన్న బండి సంజయ్

లక్ష కోట్లతో దొంగ సారా దందా.. కవిత బుక్కయ్యిందన్న బండి సంజయ్


''బీఎల్ సంతోష్ జీ గొప్ప వ్యక్తి. ఈ దేశం, ధర్మం, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి ప్రచారక్ గా పనిచేస్తున్నరు. సీఎం చంద్రశేఖర్ రావు ఓర్వలేక తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ఆయన పాత్ర లేకపోయినా, ఒక్క పైసా దొరకకపోయినా అవినీతి కేసు ఎట్లా పెడతావంటూ ఏసీబీ కోర్టు చంద్రశేఖర్ రావు చెంప చెళ్లుమన్పించిందన్నారు బండి సంజయ్. బీజేపీని బదనాం చేసేందుకు సీఎం చేసే కుట్రలను తిప్పికొడదాం'' అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. లక్ష కోట్లతో దొంగ సారా దందా చేసిన కేసులో అడ్డంగా బుక్కయిన బిడ్డను అరెస్ట్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించి యుద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

 డ్రగ్స్ కేసుల్లో ప్రభుత్వ పెద్దలు.. రీ-ఓపెన్ చేయాలన్న బండి సంజయ్

డ్రగ్స్ కేసుల్లో ప్రభుత్వ పెద్దలు.. రీ-ఓపెన్ చేయాలన్న బండి సంజయ్

అంతే కాకుండా ''కేసీఆర్ యుద్దం స్టార్ట్ చేసిండు.. యుద్దానికి మనం సిద్దమే. కేసులు, రౌడీ షీట్లు, దాడులకు భయపడే ప్రసక్తే లేదు. తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించేదాకా పోరాటాన్ని కొనసాగించి తీరుతాం''అని బండి సంజయ్ ఖానాపూర్ ప్రజానికానికి స్పష్టం చేశారు. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసుల్లో సీఎం చంద్రశేఖర్ రావు కుటుంబం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారని, వెంటనే ఆ కేసులను రీ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఖానాపూర్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, బ్రిడ్జీలను నిర్మిస్తామన్నారు బండి సంజయ్.

 ఖానాపూర్ ప్రజల్లో జోష్ ఎక్కువ.. ముగింపు సభకు నడ్డా వస్తారన్న బీజేపి ఛీఫ్

ఖానాపూర్ ప్రజల్లో జోష్ ఎక్కువ.. ముగింపు సభకు నడ్డా వస్తారన్న బీజేపి ఛీఫ్


దీంతోపాటు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు బండి సంజయ్. 10వరోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు ఖానాపూర్ పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ కు వేలాది మంది జనం తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. బీజేపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి డ్యాన్సులు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగాన్ని శ్రద్దగా ఆలకించారు. ఖానాపూర్ లో మాములు జోష్ లేదని, ఈ జోష్ చూసే ముగింపు సభకు వస్తానని జేపీ నడ్డా అన్నారని, ఈనెల 15న కరీంనగర్ లో ముగింపు సభకు జేపీ నడ్డా వస్తారని బండి సంజయ్ ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+