హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలాంటి పరిస్థితి వద్దు... అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేసీఆర్ దిశా నిర్దేశం...

|
Google Oneindia TeluguNews

ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. సభలో గందరగోళం నెలకొనే పరిస్థితులు ఉండకూడదని... ఒకరిపై ఒకరు తిట్లు,శాపనార్థాలతో విరుచుకుపపడే వాతావరణం ఉండవద్దని అన్నారు. పరస్పర దూషణలు,నిందలకు తావు లేకుండా సభ సజావుగా సాగాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు,విప్‌లు,ఎమ్మెల్సీలతో కేసీఆర్ ప్రగతి భవన్‌లో చర్చించారు.

కేసీఆర్ దిశా నిర్దేశం...

కేసీఆర్ దిశా నిర్దేశం...

అసెంబ్లీలో వాస్తవాల ఆధారంగా అర్థవంతమైన చర్చ జరగాలని... ప్రజలకు ఉపయోగపడేలా అంశాల వారీగా విశ్లేషణ జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చట్టాల రూపకల్పన,బడ్జెట్ ఆమోదంపై వాస్తవాల పునాదిగా విశ్లేషణ జరగాలన్నారు. రాష్ట్ర ప్రజలు,ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరగాలని... అప్పుడే ప్రజాస్వామిక నిర్ణయాలకు అవకాశం ఉంటుందని అన్నారు.

వాస్తవాలు ప్రతిబింబించేలా...

వాస్తవాలు ప్రతిబింబించేలా...

సభలో ఏ పార్టీ సభ్యులైనా సరే అన్ని అంశాలపై మాట్లాడవచ్చునని కేసీఆర్ అన్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించేలా మాట్లాడితే ప్రభుత్వం వాటికి వివరణ ఇచ్చేందుకు,ఆచరణాత్మక సలహాలు,సూచనలను స్వీకరించేందుకు సిద్దంగా ఉంటుందన్నారు.కూలంకషమైన చర్చ ద్వారా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. అధికార పార్టీ సభ్యులు కూడా అన్ని అంశాలను సభలో ప్రస్తావించాలన్నారు.

మంత్రులు సిద్దంగా ఉండాలని...

మంత్రులు సిద్దంగా ఉండాలని...

సభలో లేవనెత్తే అంశాలపై ఎన్ని రోజులైనా చర్చకు ప్రభుత్వం సిద్దమన్నారు కేసీఆర్. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే ప్రశ్నలు,ప్రతిపాదించే అంశాలపై స్పందించేందుకు మంత్రులు సమగ్ర సమాచారంతో సిద్దంగా ఉండాలన్నారు. సభా సమావేశాల తొలి రోజున దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి ఘన నివాళి అర్పిస్తామని తెలిపారు.

బీఏసీ ప్రతిపాదనలు...

బీఏసీ ప్రతిపాదనలు...


బీఏసీలో ప్రభుత్వం ప్రతిపాదించాల్సిన అంశాలపై కూడా కేసీఆర్ చర్చించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు-ప్రభుత్వ చర్యలు,కొత్త రెవెన్యూ చట్టం,రాయలసీమ ఎత్తిపోతల పథకం,శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం,జీఎస్టీ అమలులో కేంద్ర వైఖరి కారణంగా జరుగుతున్న నష్టం,నియంత్రిత పద్దతిలో పంటల సాగు,పీవీ శత జయంతి ఉత్సవాలు,రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై చేసిన తీర్మానాలపై కేంద్రం చడీ చప్పుడు లేకుండా ఉండటం తదితర అంశాలను బీఏసీలో ప్రతిపాదించాలని నిర్ణయించారు.

English summary
Telangana CM KCR discussed about the strategy to follow in coming assembly sessions which will begin from September 7th.He said assembly sessions should go smoothly without any disturbance from anyone on any issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X