హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈసీ పరిమితికి దరిదాపుల్లో కూడా లేదు: కేసీఆర్-రేవంత్ రెడ్డి ఎన్నికల ఖర్చు ఎంతంటే?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పైన రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఓవైపు టీడీపీ, కాంగ్రెస్ పొత్తు, మరోవైపు తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో తొలిసారి ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఏం తీర్పునిస్తున్నారోననే ఉత్కంఠ. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.

ఎన్నికలకు ముందు నేతల మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఎన్నికల ఖర్చు పైన కూడా విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ తన నియోజకవర్గంలో రూ.100 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధం చేసిందని రేవంత్ రెడ్డి అంటే, కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు రూ.500 కోట్లు పంపించారని తెరాస ఆరోపణలు గుప్పించింది.

జగన్‌ను రానీయమని చెప్పి: టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్! ఎన్ని సీట్లు గెలిచినా..జగన్‌ను రానీయమని చెప్పి: టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్! ఎన్ని సీట్లు గెలిచినా..

పరిమితి దరిదాపుల్లో లేని ఖర్చు

పరిమితి దరిదాపుల్లో లేని ఖర్చు

విమర్శలు, ప్రతి విమర్శల అంశాన్ని పక్కన పెడితే, ప్రతి అభ్యర్థి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. మద్యం గురించి చెప్పనవసరం లేదు. ఒక్కో ఓటరుకు ఇంత అని ముట్టచెప్పినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇలా లెక్కలు వేస్తే అభ్యర్థి ఖర్చు చాలా ఎక్కువే ఉంటుంది. ఎన్నికల అనంతరం అభ్యర్థులు తమ ఖర్చు లెక్కలను ఈసీకి సమర్పించారు. అభ్యర్థుల ఖర్చు ఈసీ పరిమితికి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.

కేసీఆర్, రేవంత్ రూ.6.53 ఖర్చు

కేసీఆర్, రేవంత్ రూ.6.53 ఖర్చు

గజ్వెల్ నియోజకవర్గంలో కేసీఆర్ రూ.6.53 లక్షలు ఖర్చు చేశారట. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి రూ.7.40 లక్షలు ఖర్చు చేశారట. సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి రూ.16 లక్షలు ఖర్చు పెట్టారట. సిరిసిల్లలో కేటీ రామారావు రూ.7.53 లక్షలే ఖర్చు చేశారట. హుజూర్ నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.17.06 లక్షలు మాత్రమే పెట్టారట.

 ఇతర నేతల ఖర్చు ఇలా

ఇతర నేతల ఖర్చు ఇలా

ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత ధనవంతుల్లో ఒకరైన తెరాస అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి నాగర్‌కర్నూలులో రూ.17.77 లక్షలు ఖర్చు చేశారట. పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర రావు రూ.14.44 లక్షలు ఖర్చు చేశారట. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు మద్యం బాటిల్స్ కొన్నట్లు చూపించలేదు.

English summary
Telangana Chief Minister and TRS chief K Chandrasekhar Rao and Telangana Congress working president Revanth Reddy expenditure in Telangana Assembly Elections 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X