హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యాంక్ లూటీలు మోడీకి తెలియకుండానా?:కుంభకోణాలంటూ కేసీఆర్ తీవ్ర ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏక్‌నాథ్ షిండేలతో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను హత్య చేస్తారా? అంటూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రం, బీజేపీని ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఉన్మాద పిచ్చి ఎక్కడిదాకా పోతుందని ప్రశ్నించారు. వ్యవసాయంలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు కేసీఆర్.

బ్యాంక్ లూటీలో మోడీకి తెలియకుండానా?: కేసీఆర్

బ్యాంక్ లూటీలో మోడీకి తెలియకుండానా?: కేసీఆర్

దేశంలో ఎన్పిఏలో పెరిగిపోయాయన్నారు. బ్యాంక్ లూటీలు ప్రధాని మోడీకి తెలియకుండా జరుగుతాయా? అని ప్రశ్నించారు కేసీఆర్. దేశంలో బొగ్గు కుంభకోణం జరుగుతోందన్నారు. విశ్వగురువా? విష గురువా అంటూ బీజేపీపై మండిపడ్డారు. అయతే, తనకు వ్యక్తిగతంగా మోడీతో వైరం లేదని.. విధానాలతోనేనని అన్నారు. దేశ చరిత్రలో అసమర్థ ప్రధాని నరేంద్ర మోడీ అని కేసీఆర్ దుయ్యబట్టారు. 38 శాతం పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. వేలాది కార్మికులు రోడ్డునపడ్డారన్నారు.

ఈడీ వేధింపులతో అంటూ మోడీపై తీవ్ర కేసీఆర్ ఆరోపణలు

ఈడీ వేధింపులతో అంటూ మోడీపై తీవ్ర కేసీఆర్ ఆరోపణలు


ఇంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ అసమర్థ విధానాల కారణంగా లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయన్నారు కేసీఆర్. దీంతో విదేశీ మారక నిల్వలు పడిపోతున్నాయని తెలిపారు. మోడీ సేల్స్ మెన్ పనులు చేస్తున్నారన్నారు. మేకిన్ ఇండియా పూర్తిగా విఫలమైందన్నారు కేసీఆర్. పతంగుల మాంజా, దీపాలు కూడా చైనా నుంచే వస్తున్నాయన్నారు. మోడీ వికృత, రాజకీయ దమన నీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈడీ వేధింపులతో పలు ఎయిర్ పోర్టుల నుంచి తన అనుయాయులకు మోడీ ఇచ్చుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఈడీ, ఇతర సంస్థల నోటీసులు ఇచ్చి.. తర్వాత ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకోవడంతో అంతా సమసిపోయిందన్నారు. టీడీపీ నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్ నుంచి సువేందు అధికారి, ముకుల్ రాయ్, నారాయణ రాణే, హిమంత బిశ్వశర్మ, జ్యోతిరాదిత్య సింధియాలకు దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చిన తర్వాత వారు బీజేపీలో చేరారని.. దీంతో వారంతా పవిత్రులయ్యారని విమర్శించారు. ఈటల రాజేందర్ పై కబ్జా ఆరోపణలు వస్తే.. ఆయనను కూడా బీజేపీలో చేర్చుకున్నారని వీడియోలతో సహా చూపించారు కేసీఆర్. ఇది ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు కేసీఆర్.

తెలంగాణ సర్కారుపై విష ప్రచారం అంటూ కేసీఆర్

తెలంగాణ సర్కారుపై విష ప్రచారం అంటూ కేసీఆర్


కేంద్రం విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి నాశనమవుతోందని కేసీఆర్ అన్నారు. సోషల్ మీడియా ద్వారా మతచిచ్చు పెడుతున్నారని విమర్శించారు. కొన్ని పత్రికలు తెలంగాణ సర్కారుపై లేనిపోని విమర్శలు చేస్తున్నాయన్నారు. రైతుబంధు రాదు, ఉద్యోగులకు జీతాల్లేవ్ అంటూ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులను గోసపెట్టేందుకే బీజేపీ పనిచేస్తోందా? అని ప్రశ్నించారు. అగ్నిపథ్ పథకంపైనా విమర్శలు గుప్పించారు కేసీఆర్. సైన్యంలో యువత కావాలి? కానీ, దేశానికి ప్రధానిగా ముసలి వ్యక్తి ఎందుకని మోడీని లక్ష్యంగా చేసుకున్నారు కేసీఆర్. అగ్నిపథ్ పథకం మంచిది కాదన్నారు. హిందూ మతం పేరుతో రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ చూస్తోందని కేసీఆర్ ఆరోపించారు.

మనీ లేదు.. లాండరింగ్ లేదు.: మోడీని గోకుతానంటూ కేసీఆర్

మనీ లేదు.. లాండరింగ్ లేదు.: మోడీని గోకుతానంటూ కేసీఆర్

బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలంటే యువత, మేధావులు కలిసి రావాలని కేసీఆర్ అన్నారు. మోడీ కూడా నాలా సీఎంగా ఉండే ప్రధాని అయ్యారని చెప్పారు. దొంగఫొటోలతో గుజరాత్ మోడల్ ప్రచారం చేశారని కేసీఆర్ ఆరోపించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తారని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్న కేసీఆర్.. ఎల్ఐసీని అమ్మనీయమని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై దేశం రియాక్ట్ అవుతుందన్నారు. తాను ఎవరికీ భయపడనని అన్నారు కేసీఆర్. తనకు మనీ లేదు.. లాండరింగ్ లేదని చెప్పారు. పిట్ట బెదిరింపులని అన్నారు. అగ్గితో గొక్కోకు అంటూ మోడీపై మండిపడ్డారు. తాను మాత్రం మోడీని గోక్కుంటూనే ఉంటానని, దేశం కోసం వెంటాడుతానని కేసీఆర్ స్పష్టం చేశారు.

English summary
KCR serious allegations on PM Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X