హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ జోరు...! చంద్ర‌బాబు బేజారు..! ఉత్కంఠ రేపుతున్న‌ గులాబీ బాస్ ఏపి ప‌ర్య‌ట‌న..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు మాంచి దూకుడు మీద ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాను ఏది మాట్లాడినా, ఏం చేసినా తెగ ప్ర‌చారం జ‌రిగిపోతోంది. తాను ప‌ట్టింది బంగారం అన్న‌ట్టు త‌న వ్య‌వ‌హారం చెలామ‌ణి అవుతోంది. ఇటీవ‌ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాదించిన త‌ర్వాత చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రింత దూకుడు పెంచిన‌ట్టు తెలుస్తోంది. ఏపి రాజ‌కీయాల్లో జోక్యం చేసుకుంటామ‌ని, చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని ఏ ముహూర్తంలో చెప్పారో గాని రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే అంశం గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

కేసీఆర్ దూకుడు..! సందిగ్దంలో ఏపి రాజ‌కీయ పార్టీలు..!

కేసీఆర్ దూకుడు..! సందిగ్దంలో ఏపి రాజ‌కీయ పార్టీలు..!

ఇక ఏపి ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పుకొస్తున్న చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌క‌ట‌న‌ను తెలుగుదేశం ప్ర‌భుత్వం తేలిగ్గా తీసుకోలేద‌ని తెలుస్తోంది. కేసీఆర్ ప‌ర్య‌ట‌న గురించి ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించ‌డం గ‌మ‌నార్హం. అంతే కాకుండా కేసీఆర్ రాజ‌కీయాల‌ను గంద‌రగోళంలోకి నెట్టేందుకే ప‌ర్య‌టిస్తున్నారని న‌ర్మ‌గ‌ర్బ వాఖ్య‌లు చేయ‌డం కూడా ప‌లువురి ద్రుష్టిని ఆక‌ర్శించింది. కేసీఆర్ ఏపిలో ఎవ‌రి ప‌క్షాన ప్ర‌చారం చేస్తారో స్ప‌ష్టం చేయ‌క పోయిన‌ప్ప‌టికి ప‌ర్య‌టిస్తాన‌ని ప్ర‌క‌టన చేసి సంచ‌ల‌నం స్రుష్టించారు. కేసీఆర్ ప్ర‌క‌ట‌న వ‌ల్ల ఏపి రాజ‌కీయ పార్టీలో ఇప్పుడిప్పుడే గుబులు మొద‌లైన‌ట్టు తెలుస్తోంది.

గంటా ఎవ‌రి వెంట‌..? శ‌ర‌వేగంగా మారుతున్న విశాఖ రాజ‌కీయ ప‌రిణామాలు..!! గంటా ఎవ‌రి వెంట‌..? శ‌ర‌వేగంగా మారుతున్న విశాఖ రాజ‌కీయ ప‌రిణామాలు..!!

పైకి దైర్య క‌న‌బ‌రుస్తున్నా లోప‌ల ఆందోళ‌న చెందుతున్న టీడిపి..! ఏమైనా జ‌ర‌గొచ్చు..!

పైకి దైర్య క‌న‌బ‌రుస్తున్నా లోప‌ల ఆందోళ‌న చెందుతున్న టీడిపి..! ఏమైనా జ‌ర‌గొచ్చు..!

బెజవాడలో ఏర్పాటు చేసిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఫుల్ క్లారిటీతో ప్ర‌సంగించారు. పార్టీ న‌తేల‌కు దిశానిర్దేశం చేయ‌డంతో పాటుగా కీల‌క అంశాల ప‌ట్ల ధైర్యం నూరిపోసారు. ఏపీ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోనున్న‌ట్టు చంద్ర‌శేఖ‌ర్ రావు చేసిన ప్ర‌క‌ట‌న ప‌ట్ల చాలా కీల‌క వ్యాఖ్య‌లు చంద్రబాబు నోటి నుంచి వచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి వచ్చి గందరగోళం చేయాలని చూస్తున్నారని.. ఆయన వస్తే మనకే మంచిది అన్నట్లు సీనియర్ నేతల ఎదుట తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కేసీఆర్ వాఖ్య‌ల ప‌ట్ల స‌మ‌న్వ‌య భేటీలో బాబు చ‌ర్చ‌..! ఆందోళ‌న అన‌వ‌స‌రం అంటున్న బాబు..!!

కేసీఆర్ వాఖ్య‌ల ప‌ట్ల స‌మ‌న్వ‌య భేటీలో బాబు చ‌ర్చ‌..! ఆందోళ‌న అన‌వ‌స‌రం అంటున్న బాబు..!!

ఏపీకి రావటానికి సీఎం కేసీఆర్ చాలా ఉబలాటంగా ఉన్నారని, వస్తే మనకే మంచిదంటూ టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల్లో అయోమయం సృష్టించాలనే కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ కాదని.. ఎలా తిప్పికొట్టాలో మనకు తెలుసు అంటూ నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. కేసీఆర్ వస్తే భయమా ఏంటీ.. రమ్మనండి చూద్దాం అంటూ ఘాటుగానే స్పందించారు. ఫిబ్రవరి - మార్చి నెలలోనే ఎన్నికలు రావొచ్చని.. ఇప్పటి నుంచే నేతలు, కార్యకర్తలు ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నం కావాలని, కార్యకర్తలను సమాయాత్తం చేయాలంటూ సూచనలు, సలహాలు ఇచ్చారు బాబు. అందరూ అలర్ట్ గా ఉండాలని.. ఎవరు ఎక్కడ పొరపాటు చేసిన పార్టీ మొత్తానికి నష్టం వస్తుందని హెచ్చరించారు.

ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌ని పిలుపునిచ్చిన బాబు..! క్యాడ‌ర్ లో ఉత్స‌హం నింపే ప్ర‌య‌త్నం..!

ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌ని పిలుపునిచ్చిన బాబు..! క్యాడ‌ర్ లో ఉత్స‌హం నింపే ప్ర‌య‌త్నం..!

నేతలు - కార్యకర్తల మధ్య సమన్వయం ఉండాలని హితబోధ చేశారు బాబు. ఇక నుంచి ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే ఉండి పనులు చక్కబెట్టుకోవాలని, ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా ఈవీఎంల గురించి ప్రస్తావిస్తూ.. ప్రజల్లో ఆ మిషన్స్ పై నమ్మకం పోయిందని చంద్ర‌బాబు అన్నారు. బ్యాలెట్ ఓటింగ్ బెస్ట్ అంటూ తన అభిప్రాయాన్ని సీనియర్ నేతల ఎదుట వ్యక్తం చేశారు. పోల్ అయిన ఓట్ల కంటే కౌంటింగ్ లో ఓట్లు ఎక్కువ వస్తున్న విషయాలను వివరిస్తూ.. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు బాబు. దేశ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని.. అన్నింటికీ మాన‌సికంగా సిద్ధం కావాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించారు.

English summary
Chandrasekhar Rao's announcement about the tour, the Telugu Desam government has not taken lightly. Chief Minister Chandrababu responded about KCR tour. In addition, many of the promises made to make the announcement that KCR's tours are being pushed into confusion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X