ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహా గణపతి: మొదలైన భక్తుల సందడి

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకల సందడి మొదలైంది. ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే ఖైరతాబాద్ వినాయకుడు భక్తుల సందర్శనకు సిద్ధమయ్యాడు. ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకునే ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. రెండు నెలలపాటు నిరంతరం శ్రమించిన శిల్పులు వినాయక చవితికి ఐదు రోజుల ముందే పూర్తి చేశారు.

ఇంతముందుగా విగ్రహాన్ని పూర్తి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ క్రమంలో సోమవారం నుంచే భక్తులు ఖైరతాబాద్‌లో వెలసిన పంచముఖ రుద్ర మహాగణపతిని దర్శించుకుంటున్నారు. కాగా, ఇక్కడ ఒక్క అడుగు వినాయకుడితో విగ్రహ ఏర్పాటు ప్రారంభమైంది. గత రెండేళ్ల క్రితం 65ఏళ్లు నిండిన సందర్భంగా 65 అడుగుల మహా గణపతిని ఏర్పాటు చేశారు. ఇక గత సంవత్సరం కరోనావైరస్ కారణంగా 11 అడుగులకే పరిమితం చేశారు.

 khairatabad: Panchamukha Rudra Maha Ganapathi ready for bless devotees

ఈ ఏడాది మాత్రం40 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువుతో వినాయకుడు కొలువుదీరాడు. మమాగణపతి నవరాత్రులు 10వ తేదీతో ప్రారంభమవుతాయి. కాగా, సోమవారం వినాయకుడి వద్ద హోమం నిర్వహించారు. నిమజ్జనం సెప్టెంబర్ 19న అనంత చతుర్ధశి రోజున ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ట్యాంక్‌బండ్ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తామని ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల నిర్వాహకులు తెలిపారు.

ట్యాంక్‌బండ్‌పై నుంచి హుస్సేన్‌సాగర్ జలాల్లోకి క్రేన్ ద్వారా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే తీరును సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ట్యాంక్‌బండ్‌పై రెండు క్రేన్లను ఏర్పాటు చేసి పాత విగ్రహాలను ప్రయోగాత్మకంగా నిమజ్జనం చేయించారు.

అనంతరం సీపీ అంజనీ కుమర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 10న గణేష్ చతుర్థి ప్రారంభమవుతుందని, మూడో రోజు నుంచి నిమజ్జనాలు జరుగుతాయన్నారు. 19న వేలాది విగ్రహాలు సామూహిక నిమజ్జనాలుంటాయన్నారు. ప్రమాదాలకు తావు లేకుండా, సమయం ఆదా అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల చేపట్టిన ట్యాంక్ బండ్ సుందరీకరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా చేస్తే బాగుంటుందనే విషయాన్ని పరిశీలించామని సీపీ తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

Recommended Video

    మరోసారి నగరాన్ని ముంచెత్తిన వాన. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం..!! || Oneindia Telugu

    కాగా, తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే, గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 67,720 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇక, కరీంనగర్ జిల్లాలో 31, వరంగల్ అర్బన్ జిల్లాలో 22 కేసులు గుర్తించారు. వనపర్తి జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 339 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,59,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 6,50,453 మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కరోనా మృతుల సంఖ్య 3,886కి పెరిగింది.
    ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 5,505 యాక్టివ్ కేసులున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+