హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ తో తాడోపేడో తేల్చుకోనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .. సాయంత్రం కీలక ప్రకటన ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాంగ్రెస్ తో తాడోపేడో తేల్చుకోనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి || Oneindia Telugu

కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సృష్టించిన ప్రకంపనలు ఆగటం లేదు . కాంగ్రెస్ అధిష్టానంపైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడి బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కోమటిరెడ్డి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై హై కమాండ్ సీరియస్ అయ్యింది. షోకాజ్ నోటీసులు జారీ చేసింది .

లక్ష్మణ్ అడిగింది మంచి ప్రశ్నేనట .. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం శ్రమించిన హరీష్ రావు ఎక్కడ ?లక్ష్మణ్ అడిగింది మంచి ప్రశ్నేనట .. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం శ్రమించిన హరీష్ రావు ఎక్కడ ?

నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సాయంత్రం సమావేశం కానున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సాయంత్రం సమావేశం కానున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

బుధవారం రాత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం . షోకాజ్ నోటీసులు జారీ చేసిన అధిష్టానం 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ లో ఉంటారా లేకా బీజేపీలో చేరతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ . మొన్నటికి మొన్న ఆయన ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా బీజేపీలో చేరటానికి అని వార్తలు గుప్పుమన్నాయి. తీరా ఆయన తన సోదరుడి ప్రమాణ స్వీకారానికి వెళ్లినట్టు చెప్పారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చెయ్యటంపై సీరియస్ గా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే నేడు నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు .

కాంగ్రెస్ తో తాడో పేడో తేల్చుకునేందుకు నిర్ణయం

కాంగ్రెస్ తో తాడో పేడో తేల్చుకునేందుకు నిర్ణయం

కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో తేల్చుకునేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడీ అయ్యారని తెలుస్తోంది. అందుకే ఆయన గురువారం బీజేపీ కీలక నేతలతో చర్చించి బీజేపీలో చేరే అంశంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అలాగే సాయంత్రం 4 గంటలకు తన నియోజకవర్గంలో పార్టీకార్యకర్తలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం కానున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, షోకాజ్ నోటీసులు జారీ వంటి అంశాలపై పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు. అలాగే బీజేపీలో చేరే అంశంపై కూడా చర్చించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను సైతం తనతోపాటే తీసుకెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ నెలకొంది.

నేడు సాయంత్రం కీలక ప్రకటన చేసే అవకాశం .. కోమటిరెడ్డి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

నేడు సాయంత్రం కీలక ప్రకటన చేసే అవకాశం .. కోమటిరెడ్డి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

మెుత్తానికి కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపిన ప్రకంపనలు పార్టీకి చేటు చేస్తాయా ? గురువారం సాయంత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన నిర్ణయం ఏమి ఉంటుంది? షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేక బీజేపీలో చేరుతారా అనేది తెలియాలంటే ఈ ర్జౌ సాయంత్రం ఆయన తన కీలక నిర్ణయం ప్రకటించే దాకా ఆగాల్సిందే .

English summary
It seems that Komatireddy Rajagopal Reddy is ready to take decision about the Congress party. That is why he is in talks with key BJP leaders on Thursday to give a clarity on joining the BJP. Also, Komatireddy Rajagopal Reddy will be meeting with party activists in his constituency at 4 pm .Rajagopal reddy will discuss the developments in the party and issues such as issuing showcause notices. A final decision will also be taken to discuss the issue of joining the BJP. There is a rumor that if the Komatireddy Rajagopal Reddy party defects the party, even the key leaders of the Congress party will be taken along. These developments have caused tension in the Congress party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X