హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈటలతో కొండా భేటీ.. కొత్త పార్టీపై జోరుగా మంతనాలు..?

|
Google Oneindia TeluguNews

శత్రువు శత్రువు మిత్రువు.. ఈ సామెత రాజకీయాల్లో సరిపోతుంది. ఒకరి శత్రువు మరొకరికి కూడా శత్రువు అయితే మిగతా ఇద్దరూ మిత్రులుగా మారిపోతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఈటల రాజేందర్ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఆయనకు అభిమానులే ఎక్కువే.. మద్దతిచ్చే నేతల పేర్లు కూడా మెల్లిగా బయటకు వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇదీ ఎంతవరకు నిజం.. వారంతా ఈటలతో కలిసి వస్తారా అనే అంశానికి సంబంధించి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఈటలతో కొండా భేటీ..

ఈటలతో కొండా భేటీ..


ఇది ఇలా ఉంటే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఇప్పుడు ఏ పార్టీలో లేరు. రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనలో మాత్రం ఉన్నారు. పరిస్థితి ఇదీ.. అయితే ఆయన గురువారం రాత్రి ఈటల రాజేందర్‌తో సమావేశం అయ్యారు. ఈటల రాజేందర్ కూడా రాజకీయ పార్టీ పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. ఈ సమయంలో కొండా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరూ కలిసి కొత్త రాజకీయ పార్టీ గురించి చర్చిస్తారని గుస గుసలు వినిపిస్తున్నాయి.

ఈటల ఇంట్లోనే..

ఈటల ఇంట్లోనే..


మేడ్చల్‌లోని ఈటల రాజేందర్ నివాసంలో భేటీ జరిగింది. కొండా, ఈటల కలిసి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోన్న వేళ.. భేటీ చర్చకు దారితీసింది. పార్టీ విషయంపై చర్చించేందుకే ఈటల రాజేందర్ ఇంటికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెళ్లారని విశ్వసనీయంగా తెలుస్తోంది. కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. 2018 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటించలేదు. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈటల రాజేందర్‌ను లవడంతో ఇద్దరూ కలిసి కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలను బలం చేకూరుతుంది.

Recommended Video

KCR కి V. Hanumantha Rao లేఖ, మల్లారెడ్డి, పల్లా, పువ్వాడలపై చర్యలేవి?
బర్తరఫ్..

బర్తరఫ్..


దేవరయాంజల్ భూముల వ్యవహారంలో టీఆర్ఎస్ హై కమాండ్ ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈటలపై అధికారపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈటల ఒక్కరిపైనే కాదు.. టీఆర్ఎస్‌లో భూకబ్జాలకు పాల్పడిన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈటల రాజేందర్ పార్టీ మారితే తమ తమ పార్టీల్లోకి తీసుకోవాలని యోచిస్తున్నాయి. కానీ ఆయన మాత్రం సొంతంగా పార్టీ పెట్టాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొండా కలువడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

English summary
senior leader konda visweshwar reddy meets etela rajender. they both discuss about new political party launch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X