తెలంగాణ ప్రభుత్వంతో ‘కూ’ ఎంవోయూ, డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్.. కూ మరో ముందడుగు వేసింది. తెలంగాణ రాష్ట్రంలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ఎంవోయూపై సంతకాలు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిన సంగతి తెలిసిందే. అందుకోసమే హైదరాబాద్‌లో తమ సెంటర్ నెలకొల్పాలని అనుకుంటుంది.

తెలుగుకు మరింత ప్రోత్సాహం
హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు, భాషలకు చెందిన వారు ఉంటారు. 10 భాషలలో వ్యక్తికరణ చేయవచ్చు. ఇక్కడ డెవలప్ సెంటర్ ఏర్పాటు చేయాలని అనుకుంది. రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారిని మరింత ప్రోత్సహం కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సంస్కృతి, గొప్ప వారసత్వాన్ని ప్రోత్సహిస్తోంది. ఇలా అన్ని అంశాలు కలగలసి సెంటర్ ఏర్పాటుకు నాంది పలికింది.

సోషల్ మీడియా సాధనం
ప్రభుత్వ అంశాలను జనాలకు తీసుకెళ్లడానికి సోషల్ మీడియా సాధనంగా పనిచేస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తాము కూ తో కలిసి పనిచేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వం సమాచారం, సేవలను మరింత వేగంగా వ్యాప్తి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. జనంతో కలిసేందుకు తమ ప్రయత్నాలు మరింత మెరుగు అవుతాయని ఆయన చెప్పారు.

బహు భాషలు
దేశంలో బహు భాషలు మనుగడలో ఉన్నాయని.. ఇక్కడ సోషల్ మీడియా అవసరం ఉందని కూ కో ఫౌండర్, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. స్వతంత్రంగా, తటస్థంగా ఉండటం వల్ల కూ అనేది భారతీయులకు మరింత దగ్గర అవుతుందని వివరించారు. డిజిటల్ భావ ప్రకటనా స్వేచ్చతో సాధికారత కల్పించేందుకు మరింత ముందుకు వెళతామని తెలిపారు. ఇందుకు తమకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం అభినందనీయం అని చెప్పారు.












Click it and Unblock the Notifications