హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్... 20 మంది క్వారెంటైన్‌కు...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ కోఠిలోని గోకుల్ చాట్ యజమాని విజయ్ వైరాగ్యి(70)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు గోకుల్ చాట్ షాపును సీజ్ చేశారు. ముందు జాగ్రత్తలో భాగంగా అక్కడ పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారెంటైన్‌కి తరలించారు.యజమానికి కరోనా సోకిన నేపథ్యంలో.. గత 3 రోజులుగా షాపుకు వచ్చి స్నాక్స్ తిన్నవారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

 ప్రతీ ఐదుగురిలో ఒకరు.. కరోనా రిస్క్ వాళ్లలో ఎక్కువ... అధ్యయనంలో ఆసక్తికర విషయాలు.. ప్రతీ ఐదుగురిలో ఒకరు.. కరోనా రిస్క్ వాళ్లలో ఎక్కువ... అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..

గోకుల్ చాట్‌ యజమానికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. పక్క షాపుల యజమానుల్లోనూ ఆందోళన మొదలైంది. సాధారణ రోజుల్లో గోకుల్ చాట్ ఎంత రద్దీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. మార్చి 25న లాక్ డౌన్ తర్వాత మూడతపడ్డ ఈ షాపు.. ఇటీవలి సడలింపుల తర్వాత తిరిగి తెరుచుకుంది. తాజాగా ఆ యజమానికి పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో మరోసారి మూతపడింది.

kothi gokul chat owner tested coronavirus positive in hyderabad

Recommended Video

CM KCR - 10 రోజుల్లో Rythu Bandhu ఖాతాల్లో డబ్బును జమ చేయనున్న KCR

ఇప్పటివరకూ తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5193గా ఉంది. సోమవారం (జూన్ 15) ఒక్కరోజే 219 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 189 కేసులు ఉన్నాయి. ఇందులో 449 మంది వలస కార్మికులు,విదేశీయులు ఉన్నారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 2766 మంది డిశ్చార్జి అయ్యారు.

English summary
Hyderabad Gokul Chat owner Vijay Vairagyi (70) tested coronavirus positive on Tuesday. GHMC officials seized that shop and send 20 staff to home qurantine and collecting details of visitors who visited in last three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X