ల‌గ‌డ‌పాటి ది స‌ర్వే కాదు : చిల‌క జోస్యం : అస‌లు క‌ధ ఇదీ: బ‌య‌ట పెట్టిన కెటిఆర్‌..!

మాజీ ఎంపి ల‌గ‌డ‌పాటి బ‌య‌ట‌పెట్టిన స‌ర్వే పై మంత్రి కెసిఆర్‌.. కెటిఆర్ ఫైర్ అయ్యారు. ల‌గ‌డ‌పాటి ఇటువంటి స‌ర్వే ను బ‌య‌ట పెడుతున్నార‌ని ముందే వీరికి స‌మాచారం ఉంది. ఉద‌యం మ‌క్త‌ల్ స‌భ‌లోనే కెసిఆర్ ఈ స‌ర్వే పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. కొంద‌రు లంగ స‌ర్వేలు బ‌ట‌య పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. వారు అంచ‌నా వేసిన విధం గానే సాయంత్రానికి తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల పై ల‌గ‌డ‌పాటి దాదాపు త‌న అంచ‌నాలు బ‌య‌ట పెట్టారు. ప్ర‌స్తుత నాడి చూస్తుంటే ప్ర‌జా కూట‌మి కే అధికారం అని తేల్చేసారు. దీంతో..ఇది స‌ర్వే కాద‌ని..చిల‌క జోస్య‌మ‌ని చెప్పుకొచ్చిన తాజా మాజీ మంత్రి కెటిఆర్ దీని వెనుక జ‌రిగిందేంటో...అస‌లు విష‌యం ఇదీ అంటూ ట్వీట్ చేసారు.

KTR Fires on Lagadapati Rajagopal Survey details...

ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఒత్తిడి మేర‌కే ల‌గ‌డ‌పాటి రాజగోపాల్ త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను మార్చేసార‌ని కెటిఆర్ ఆరోపించారు. న‌వంబ‌ర్ 20న ల‌గ‌డ‌పాటి త‌న‌కు ఒక మెసేజ్ పంపారంటూ ఆ మెసేజ్ ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఆ మెసేజ్ లో టిఆర్‌య‌స్ కు 65- 70 సీట్లు వ‌స్తాయ‌ని ల‌గ‌డ‌పాటి పేర్కొన్నారు. స‌ర్వే పేరుతో ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు చంద్ర‌బాబు చేస్తున్న కుట్ర‌ల‌ను బ‌ట‌య పెట్టేందుకే తాను ఈ మెజేస్ ను ఇలా షేర్ చేయాల్సి వ‌చ్చింద‌ని కెటిఆర్ వివ‌రించారు.

ల‌గ‌డ‌పాటి త‌న‌కు పంపిన మెసేజ్ ను వివ‌రిస్తూ.. అయితే నవంబర్‌ 20 నాటికి ఉన్న పరిస్థితిని బట్టి ఆ ఫలితాలు చెప్పానని, కేసీఆర్‌ వ్యూహాలపై తనకు పూర్తి అవగాహన ఉన్నదని చెప్పిన లగడపాటి.. తన అంచనాలను మించి టీఆర్‌ఎస్‌ సీట్లు సాధించినా ఆశ్చర్యం లేదని అన్నారని కేటీఆర్‌ వెల్లడించారు. ఈ విషయం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ నిరూపితమైందని లగడపాటి కేటీఆర్‌కు పంపిన మెసేజ్‌లో తెలిపారు. కానీ, ఇప్పుడు ల‌గ‌డ‌పాటి చెబుతున్న విష‌యాల‌ను లోతుగా ప‌రిశీలిస్తే అది లగడపాటిది సర్వే కాదని, చిలక జోస్యమని ఆయన ఎద్దేవా చేశారు. సర్వేల పేరుతో గందరగోళం సృష్టించే లాస్ట్‌ మినట్‌ ప్రయత్నమన్నారు. లగడపాటి, చంద్రబాబు పొలిటికల్‌ టూరిస్టులని చెప్పారు. డిసెంబర్‌ 11న తట్టాబుట్టా సర్దేస్తారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. దీంతో..ఇప్పుడు సంచ‌ల‌నం గా మారిన ల‌గ‌డ‌పాటి స‌ర్వేను టిఆర్‌య‌స్ నేత‌ల విమ‌ర్శ‌లు చుట్టు ముడుతున్నాయి. చివ‌రి రోజు ప్ర‌చారంలోనూ టిఆర్‌య‌స్ నేత‌ల‌కు ఈ అంశాన్నే టార్గెట్ చేసే అవ‌కాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+