KTR: త్వరలో అందుబాటులోకి డబుల్ డెక్కర్ బస్సులు.. ఫొటోలు షేరు చేసిన కేటీఆర్..
హైదరాబాద్ లో త్వరలో డబుల్ డెక్కర్ బస్సు చక్కర్లు కొట్టనుంది.
హైదరాబాద్ లో ఇక ఎలక్ట్రిక్ డబుల డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ లో త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రయాణికులకు అతిత్వరలోనే టీఎస్ఆర్టీసీ డబుల్ డెక్కర్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
గతేడాది 2020 నవంబర్ లో మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ సార్ ఇది చూడండి. ఎవరైనా ఈ డబుల్ డెక్కర్ బస్సు గుర్తు ఉందా.. జూ పార్క్ నుంచి అఫ్జల్ గంజ్, హైకోర్టు మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లేదని కోసం దీన్ని మళ్లీ ప్రారంభించండని డబుల్ డెక్కర్ బస్సు ఫొటో షేరు చేశారు.
As promised by minister @KTRBRS "Double Decker" buses are back in Hyderabad and electric this time.
— KTR News (@KTR_News) February 7, 2023
They will soon be zooming on the city roads. https://t.co/htHkN8FfSB pic.twitter.com/FogrdpwK11

దానికి కేటీఆర్ స్పందిస్తూ
"అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌కి వెళ్లేటప్పుడు డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించినందుకు నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. డబుల్ డెక్కర్ బస్సులు తీసుకొచ్చేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ను కోరుతున్నాం" ట్వీట్ చేశాడు.












Click it and Unblock the Notifications