అమిత్ షా పర్యటనపై కేటీఆర్ సెటైర్లు: బట్టేబాజ్ అంటూ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటైనా చూపగలరా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
తెలంగాణకు ఐటీఐఆర్ మంజూరు చేయలేదని, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. మెట్రో రెండో దశ, ఐఐఎం ఏర్పాటు చేయలేదని, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్ఐడీ, నవోదయ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇవ్వలేదంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేవెళ్ల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రమంత్రి తెలంగాణ సర్కారు తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా బీజేపీపై ఘాటుగా స్పందించారు. 'త్వరలో అధికారంలోకి కాదు.. బీజేపీ అంధకారంలోకే... త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ... ఢిల్లీలో.. ప్రధాని కుర్చీ ఖాళీ.. 2024లో.. వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదు. మరోసారి
మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే.. దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టే
అనే బలమైన భావనలో ప్రజలు' అని కేటీఆర్ విమర్శించారు.
I thank HM @AmitShah Ji on laying the foundation for
— KTR (@KTRBRS) April 23, 2023
☑️ ITIR Hyderabad
☑️ National Project status for Palamuru - RR lift irrigation project
☑️ Hyderabad Metro Phase 2
☑️ IIM, IISER, IIIT, IIT, NID, Navodayas, Medical & Nursing Colleges
Oh Wait 😁 he did none of that.
Amit…
అంతేగాక, 'కారు స్టీరింగ్ కాదు... బీజేపీ స్టీరింగే ఆదానీ చేతికి చిక్కింది.
కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం.. విలవిలలాడుతోంది.
హిండెన్ బర్గ్ రిపోర్ట్‌తో బీజేపీ ఫుల్ పిక్చర్ ను దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారు. ఇంకా ఏ ట్రయిలర్ అవసరం లేదు. తెలంగాణలో
గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు నడవవు. ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవు.
ఆదానీపై జేపీసీ వేయని బీజేపీకి సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కు ఉందా..?
ముక్కునేలకు రాసినా... మోకాళ్ల యాత్ర చేసినా... మోసాల మోదీని తెలంగాణ నమ్మదు.బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.












Click it and Unblock the Notifications