Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగుతోపాటు ప్రాంతీయ భాషల్లోనూ ఆ పరీక్ష నిర్వహించండి: అమిత్ షాకు కేటీఆర్ రిక్వెస్ట్

హైదరాబాద్: ఇటీవల విడుదల చేసిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) నోటిఫికేషన్‌ను సవరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మొత్తం 9212 ఉద్యోగాల నియామకం కోసం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కేవలం హిందీ, ఇంగ్లీష్‌లోనే పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొనగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇతర అధికారిక భాషలను కూడా ఇంట్లో చేర్చాలని ట్విట్టర్ వేదికగా కోరారు.

ఈ పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారని.. దీంతో ఇంగ్లీష్ మీడియంలో చదవనివారు, హిందీయేతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రకరకాల పరీక్షలు నిర్వహించడానికి బదులు ఒకే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను సులభతరం చేసేలా 12 భాషల్లో నిర్వహించాలని జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ సూచించిందని.. అయినప్పటికీ ఈ నోటిఫికేషన్‌తోపాటు అది ఎక్కడ సరిగా అమలు కావడం లేదని పేర్కొన్నారు.

KTR tweet to Amit Shah

ఇది ఇలావుండగా, సీఆర్పీఎఫ్‌లో 9212 కానిస్టేబుల్(టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల కోసం మార్చి 27 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పరీక్షకు ఏప్రిల్ 24 వరకు పురుష, స్త్రీ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించనున్నట్లు సీఆర్పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తెలుగుతోపాటు ప్రాంతీయ భాషల్లో పరీక్షనిర్వహించానలి కోరుతూ హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు.

సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+