Mamatha: కూకట్‍పల్లి జోనల్ కమిషనర్ మమతపై బదిలీ వేటు..
హైదరాబాద్ లోని కూకట్‍పల్లి జోనల్ కమిషనర్ మమత బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో అభిలాష ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2010 నుంచి మమత జీహెచ్ఎంసీలోనే పనిచేస్తున్న సంగతి తెలిసిందే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నేతలతో ఉన్న సంబంధాల కారణంగా జోనల్ కమిషనర్ గా కొనసాగినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
గతంలో మమతను జూబ్లీహిల్స్ కు డిప్యూటీ కమిషనర్ గా ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే ఆమె తన పలుకుబడిని ఉపయోగించికుని 24గంటల్లో షేరిలింగంపల్లి సర్కిల్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. ఎన్నికలకు ముందు ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. 24గంటల్లో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా బదిలీ చేయించుకున్నారు మమత.

తాజాగా మమతపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆమెను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ గా నియమించారు.శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కూడా ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆయన స్థానంలో శబరిహను నియామకమించారు.












Click it and Unblock the Notifications