Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. అరగంట ఆసల్యంగా మెట్రో రైళ్లు..!
మీరు హైదరాబాద్ మెట్రోలో రెగ్యులర్ గా ప్రయాణం చేస్తున్నారా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సింది. జూన్ 30 నుంచి అంటే శుక్రవారం నుంచి మెట్రో రైళ్లు అరగంట ఆలస్యంగా నడవనున్నాయి. అయితే ఇది ఒక్క రూట్ మాత్రమేనని మెట్రో తెలిపింది.
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మధ్య కారిడార్-IIలో ఉదయం సర్వీసులలో రైళ్లు 30 నిమిషాల ఆసల్యంగా నడుస్తాయని వెల్లడించింది. కారిడార్ - II నిర్మాణం కారణంగా సవరించిన షెడ్యూల్‌లో నడుస్తుందన్నారు. RTC క్రాస్‌రోడ్స్‌లో మెట్రో ట్రాక్ పై నుంచి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. దీని కారణంగా కూడా ఆసల్యంగా రైల్లు నడుస్తాయని చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అభ్యర్థన మేరకు షెడ్యూల్ సవరించామని ఎల్అండ టీ తెలిపింది. ఈ కారిడార్‌లో మెట్రో సేవలు ఉదయం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. సవరించిన షెడ్యూల్ దాదాపు రెండు వారాల పాటు అమలులో ఉంటుందని సంస్థ తెలిపింది.

మరోవైరు సిటీలో మెట్రో రైలు ట్రాక్ ను విస్తరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా చాలాసార్లు స్పందించారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు, మియపూర్ నుంచి లింగంపల్లి వరకు మెట్రోను విస్తరించాలని డిమాండ్లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications