మైనంపల్లి వల్ల ప్రాణహనీ.. మహిళా కమిషన్‌కు కార్పొరేటర్ కంప్లైంట్

ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వల్ల తనకు, తన భర్తకు ప్రాణహానీ ఉందని మౌలాలీ కార్పొరేటర్ సునీతా శేఖర్ ఆరోపించారు. ఆ మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్‌గా గెలిచినప్పటి నుంచి తమపై దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌ అభివృద్ధి కార్యక్రమాలకు తనకు సమాచారం ఇవ్వడం లేదన్నారు.

సమాచారం లేదు..?

సమాచారం లేదు..?

ఓడిపోయిన కార్పొరేటర్‌ భర్తతో ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్‌ అధికారులు కూడా తమకు సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. తన క్యారెక్టర్‌పై నిందలు మోపుతూ, ఎమ్మెల్యే అనుచరులతో, ఆడవాళ్లతో అసభ్యంగా తిట్టిస్తూ వీడియోలు పెట్టి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 చర్యలు తీసుకోరు..

చర్యలు తీసుకోరు..

తనను తిట్టిన మహిళలపై విచారణ చేపట్టి ఎమ్మెల్యే హనుమంతరావు, ఆయన అనుచరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మల్కాజ్‌గిరి పోలీసులపై తమకు నమ్మకం లేదని చెప్పారు. సాటి మహిళగా తనకు న్యాయం చేస్తారని మహిళా కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, ఇతర నేతలతో కలిసి సునీతా శేఖర్‌ వినతిపత్రం అందించారు.

 పెన్ డ్రైవ్

పెన్ డ్రైవ్

తన బెదిరింపులకు సంబంధించిన వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కూడా ఇచ్చారు. గతేడాది ఆగస్టు 15న తన సహచర కార్పొరేటర్‌ శ్రవణ్‌పై ఎమ్మెల్యే, అనుచరులు భౌతికదాడులకు పాల్పడిన ఘటనలో తాను ప్రత్యక్ష సాక్షినని సునీతా శేఖర్‌ పేర్కొన్నారు. తమను ఇప్పుడు బెదిరింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. తమకు తగిన భద్రత కల్పించాలని ఆమె కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+