Radisson Drugs Case: అక్కచెల్లెళ్ల నాటకాలు.. లిషిత మిసింగ్ అంటూ ఫిర్యాదు..!

రాడిసన్ హెటల్ డ్రగ్స్ కేసులో నిందితులు పోలీసులకు సహకరించడం లేదని తెలుస్తోంది. ఈ కేసీలో ఏ10గా ప్రముఖ దర్శకుడు క్రిష్ ఉన్నారు. క్రిష్ విచారించడానికి అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. అతను పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఏ8 గా ఉన్న నటి లిషిత కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మూడు రోజుల క్రితం లిషత ఇంటికి నోటీసులు అంటించారు. ఆమె సోదరి నోటీసులపై లాయర్ తో పాటు స్టేషన్ కు వచ్చింది.

లిషిత ఇంట్లో లేదని రాగనే విచారణకు పంపిస్తామని అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాదు తన సోదరి లిషిత కనిపంచడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. డ్రగ్స్ కేసు నమోదు అయిన నుంచి తన సోదరి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు అక్కచెల్లెళ్లు నాటకాలు ఆడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రధాన
నిందితుడిగా ఉన్న అబ్బాస్ విచారణలో కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది.

Lishita who is on the run in the Radisson drug case

శ్వేత, లిషీ, నీల్ కూడా డ్రగ్స్ తీసుకున్నారని అబ్బాస్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీలోనే డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నట్లు చెబుతున్నారు. శ్వేత, లిసి, నీల్ తోపాటు సందీప్, డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతి సారి కూడా రాడిసన్ హోటల్ లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

క్రిష్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తున్నట్లుగా తెలిసింది. నిందితుల్లో రఘు చరణ్ బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. ఇక క్రిష్ ముంబై ఉన్నట్లు తెలిసింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారి లోకేషన్లు గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. అయితే ఈ డ్రగ్స్ కేసులో కూడా కొన్ని రోజులు హడావుడి ఉంటుందని.. తర్వాత అంతా మామూలేనని సాధారణ ప్రజలు భావిస్తున్నారు. చూడాలి ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకెళ్తారో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+