ప్రేమ కలిపింది.. అదే ప్రాణం తీసింది.. ఆ యువతి ఇక దక్కదని..!
హైదరాబాద్ : ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. నాలుగేళ్లుగా కలిసి తిరిగారు. స్కూల్ ఏజ్‌లోనే ముదిరిన వారి ప్రేమ.. కాలేజీ చదువుకు వచ్చేసరికి దూరమైంది. చిన్న చిన్న కారణాలతో ఆ యువతి తనను పక్కన పెడుతోందని భావించిన సదరు యువకుడు చివరకు ప్రాణాలు విడిచాడు. హైదరాబాద్‌లో జరిగిన ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది.
బంజారాహిల్స్ ప్రాంతంలోని ఫిల్మ్ నగర్ ఎంఆర్‌సీ కాలనీకి చెందిన 20 సంవత్సరాల అభిషేక్ పాండే ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే వరుసకు దూరపు బంధువయ్యే 19 సంవత్సరాల యువతితో నాలుగేళ్ల కిందట ప్రేమలో పడ్డాడు. ఆ యువతి కూడా ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. అయితే మైనర్లుగా ఉన్నప్పుడే వీరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఆ క్రమంలో నాలుగేళ్లు ప్రేమ పక్షుల్లా తిరిగారు.

నాలుగేళ్లుగా కొనసాగిన వారి ప్రేమకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సినిమాలకు, షికార్లకు తిరిగారు. అయితే అకస్మాత్తుగా రెండు నెలల కిందట వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. చిన్న చిన్న కారణాలతో బ్రేకప్ దాకా వచ్చింది పరిస్థితి. తనతో ఇక మాట్లాడొద్దంటూ ఆ యువతి ఖరాఖండిగా చెప్పేసింది. దాంతో సదరు యువకుడు మనస్థాపానికి గురయ్యాడు.
రెండు నెలలుగా తనతో మాట్లాడకపోవడం.. కనీసం మేసేజ్‌లకు కూడా స్పందించకపోవడంతో ఆ యువకుడు చనిపోవాలని డిసైడయ్యాడు. ఆ క్రమంలో విషయం చెబుతూ ఆ యువతికి మేసేజ్ పంపించాడు. తాను చనిపోతున్నానంటూ సమాచారం ఇచ్చాడు. అయినా ఆమె స్పందించలేదు. దాంతో ఇక సెలవంటూ మరో మేసేజ్ పెట్టి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే తన కొడుకు మృతికి సదరు యువతి కారణమంటూ అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications