పెద్దలు ఒప్పుకోలేదు..! ప్రేమ ఇద్దరి ప్రాణాలు తీసింది

శంషాబాద్‌ : ప్రేమికులు విచక్షణ కోల్పోయారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి పాలిట మృత్యువుగా మారింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

పిల్లోనిగూడ సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఓ యువజంట విగతజీవులుగా కనిపించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా వారు ప్రేమికులుగా తేలింది.

lovers suicide in shamshabad mandal due to elders reject their love

నందిగామ మండలం పిట్టలగూడేంకు చెందిన శ్రవణ్ డిగ్రీ చదువుతున్నాడు. మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన మయూరి ఇంటర్మీడియట్ చదువుతోంది. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న శ్రవణ్, మయూరి తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు అంగీకరించలేదనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్టుమార్టమ్ నిమిత్తం వారి మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+