హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేఖాస్త్రం: రేవంత్‌కు మధుయాష్కీ లెటర్.. రెడ్డి కాంగ్రెస్ అంటూ ఫైర్..?

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అందులో చాలా అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కామెంట్లను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు, వర్గాలు, మతాల కలయిక అన్నారు. వ్యక్తి కన్నా వ్యవస్థ ముఖ్యం, పార్టీ ముఖ్యం అన్నారు.

 ఇదీ సరికాదు..

ఇదీ సరికాదు..

పదవులు పొంది రెడ్డి కాంగ్రెస్ ఏర్పాటు చేసి అధినాయకత్వాన్ని బలహీన పర్చాలని చూసినా, వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినా చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చేరదీసిన కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ఎంతోమంది నాయకులను, సీఎంలను, కేంద్ర-రాష్ట్ర మంత్రులను, గవర్నర్లు, ఏఐసీసీ, పీసీసీ అధక్షులుగా పదవులు ఇచ్చిందని గుర్తుచేశారు.

 1991లోనే పదవీ ఆఫర్

1991లోనే పదవీ ఆఫర్


సోనియాగాంధీకి 1991లో ప్రధానమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చినా.. తాను తప్పుకుని పీవీ నరసింహారావుగారిని ప్రధానిని చేశారని గుర్తుచేశారు. యూపీఏ-1 లో తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టం, రైతు రుణమాఫీ, సమాచార హక్కు చట్టం, ఐటీ, టెలికామ్ రెవల్యూషన్, సివిల్ న్యూక్లియర్ డీల్, ఇతర సంక్షేమ పథకాల అమలు వల్ల, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ నాయకత్వంలో యూపీఏ - 2 ఏర్పడిందన్నారు.

పదవీతో అందలం

పదవీతో అందలం


వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ నాయకుడిగా, బీసీ బిడ్డ డీ శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా, రెడ్డి-బీసీ కలయికతో సోనియాగాంధీ నాయకత్వంలో 2004-2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 42 లోక్ సభ స్థానాలకు గానూ 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించిందని చెప్పారు.

దెబ్బతిన్న ఆత్మగౌరవం

దెబ్బతిన్న ఆత్మగౌరవం


ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా ఆత్మగౌరవ పోరాటం అన్నారు. తెలంగాణ రాబందుల సమితి పార్టీ చేతిలో ఆత్మగౌరవం పూర్తిగా దెబ్బతిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్ డిక్లరేషన్, రాహుల్ గాంధీ సభతో ఉత్తేజితులై, ఊసరవెల్లి కేసీఆర్ మోసాలను గ్రహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ వైపు వస్తున్నాయని తెలిపారు.

English summary
congress leader madhu yaski goud write letter to tpcc chief revanth reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X