మహేశ్ బ్యాంక్ కేసు: షహనాజ్ ఖాతాలో రూ.6.9 కోట్లు.. ఓటీపీ కోసం నంబర్ మార్చకపోవడంతో సందేహాం

మహేష్ బ్యాంక్ సర్వర్ అకౌంట్ హ్యాకింగ్ కేసులో దర్యాప్తు కీలకదశకు చేరుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసులో పురోగతి సాధించారు. బ్యాంకు సర్వర్ హ్యాకింగ్‌కు సంబంధించి ముగ్గురు ఖాతాదారుల పాత్ర లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బషీర్‌బాగ్‌ బ్రాంచ్‌లో షహనాజ్ పేరుతో అకౌంట్‌ ఓపెన్ చేసిన ఓ మహిళ పాత్రపై ముందు నుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళకు సంబందించిన ఖాతాలో రూ.6.9 కోట్లు జమ కాగా.. కొద్ది సేపటికే హ్యాకర్లు ఆ నగదును చిన్న మొత్తాల్లో ఇతర ఖాతాలకు మళ్లించారు.

ముంబైలో షహనాజ్..

ముంబైలో షహనాజ్..


షహనాజ్ బ్యాంకు అకౌంట్‌కు లింకై ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయగా.. ఆమె ముంబైలో ఉన్నట్లు గుర్తించారు. హ్యాకింగ్‌కు సంబంధించి ఓటీపీ కోసం బ్యాంకు అధికారుల ఫోన్ నంబర్లను మార్చిన కేటుగాళ్లు.. షహనాజ్ నెంబర్ మాత్రం మార్చలేదు. ప్రతి లావాదేవీకి సంబంధించిన ఓటీపీ, సమాచారం ఆమె నంబర్‌కు చేరాయి. షహనాజ్ సహా మరో ముగ్గురి ఖాతాల్లోకి నగదు చేరిందని గుర్తించి.. శుక్రవారం వారిని విచారించారు. తమ ఖాతాల్లోకి వచ్చిన నగదు చిన్న మొత్తాల్లో మరో 128 మంది ఖాతాల్లోకి చేరినట్లు ఆ ముగ్గురు ఖాతాదారులు పోలీసులకు వివరించారు. దీంతో హ్యాకింగ్ కు సంబంధించి ఆ ముగ్గురికి సంబంధం లేదని నిర్ధారణకు వచ్చారు.

 4 ఖాతాల నుంచి డబ్బు..

4 ఖాతాల నుంచి డబ్బు..

నాలుగు ఖాతాల నుంచి డబ్బు ఉత్తరాదితోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని 200 మంది ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. వాటి నుంచి మరికొన్ని ఖాతాల్లోకి నగదు బదిలీ ఆయినట్లు గుర్తించారు. ఆయా ఖాతాదారులను పట్టుకుంటే సూత్రధారుల గురించి తెలిసే అవకాశం ఉందని భావించారు. ఆ మేరకు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించారు. బంజారాహిల్స్‌లో గల మహేష్ బ్యాంక్ మెయిన్ సర్వర్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లి లోతుగా విచారణ చేపట్టడంతో హ్యాకింగ్‌ పై దర్యాప్తు అధికారులకు స్పష్టత వచ్చింది.

4 విభాగాలు

4 విభాగాలు

మహేష్‌ బ్యాంకు అధికారులు, సర్వర్‌ నిర్వాహకులతోపాటు ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో కలిసి సైబర్ క్రైమ్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. హ్యాకర్లు ప్రాక్సీ ఐపీ అడ్రస్‌ వాడి సర్వర్ లోకి ప్రవేశించారు. ప్రాక్సీ ఐపీ అడ్రస్‌ ద్వారా మొదట సర్వర్‌లోకే ప్రవేశించారని, ఆపై బ్యాంక్‌ నెట్‌వర్క్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారని గుర్తించారు. దీని వెనుక సైబర్ నిపుణుల ప్రమేయం ఉండి ఉంటుందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Recommended Video

    Natti Kumar : Ys Jagan కోసమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా | Oneindia Telugu
    కోట్లు లూటీ

    కోట్లు లూటీ

    మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ అటాక్ జరిగింది. సైబర్ క్రిమినల్స్ కోట్ల రూపాయలు కొట్టేశారు. బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి మరీ నగదును దోచుకున్నారు. బ్యాంకు అకౌంట్లలో గల రూ.12కోట్లకు పైగా నగదును కాజేశారు. హ్యాక్ చేసిన సర్వర్ నుంచి 120 అకౌంట్లకు నగదు బదిలీ చేశారు. బ్యాంకు మెయిన్ సర్వర్ పై సైబర్ అటాక్ జరిగినట్లు గుర్తించిన బ్యాంకు యాజమాన్యం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ మరింత ముమ్మరం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+