Durgam Cheruvu: ప్రమాదకరంగా దుర్గం చెరువు నీరు.. నీటిలో డేంజరస్ కెమికల్స్..!
ఇప్పుడు హైదరాబాద్ చూడదగిన ముఖ్య ప్రాంతాల్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఒకటి. ఇప్పుడు ఏ సినిమాలో చూసినా ఈ కేబుల్ బ్రిడ్జి కనిపిస్తుంది. దుర్గం చెరువు పైకి ఎంత అందంగా కనిపిస్తోందో.. లోపల అంత గరళంగా ఉంది. దుర్గం చెరువు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నట్లు మహీంద్ర యూనివర్సిటీ అండ్ఐఐటీహెచ్టీమ్ తెలిపింది. ఈ చెరువు ఇప్పుడు వ్యర్థాలు, కాలుష్యంతో నిండిపోయినట్లు మహీంద్ర యూనివర్సిటీ అండ్ఐఐటీహెచ్టీమ్ స్టడీ చేసింది. దుర్గంలో చెరువులో వివిధ కంపెనీల నుంచి వస్తున్న కెమికల్స్ కలవడంతో నీరు డేంజర్ గా మారాయి.
దుర్గం చెరువు నీటిలో ఇప్పటికే ఆక్సిజన్ శాతం భారీగా తగ్గిపోయింది. చేపలు, కప్పలు, ఇతర జలచరాలు దుర్గం చెరువులో బతుకలేకపోతున్నాయి. చెరువు నీటిలో యాంటి డిప్రెసెంట్స్, పెయిన్‌కిల్లర్స్, యాంటి ఒబెసిటీ మెడిసిన్స్, వెయిట్ లాస్ (స్థూలకాయం) తగ్గించే మెడిసిన్ తో పాటు కొకైన్ వంటి విషపూరిత పదార్థాలు ఉన్నట్లు స్టడీలో తేలింది. దుర్గం చెరువు దాదాపు 84 ఎకరాల్లో ఉంది. మాదాపూర్ జూబ్లీహిల్స్ ప్రాంతాల మధ్య ఉన్న ఈ చెరువు చుట్టు గతంలో ఎలాంటి భవనాలు లేవు, కట్టడాలు లేవు.

గ్రామాల్లో ఉండే చెరువులాగా ఉండేది. కానీ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందడంతో చెరువు చుట్టు పెద్ద భవనాలు, ఐటీ కంపెనీలు వెలిశాయి. ఒక్కడు నగర శివారుగా ఉండే దుర్గం చెరువు ఇప్పుడు నగరంలో మధ్యలో మారింది. చెరువు చుట్టూ సిటీ విస్తరించింది. దుకాణాలు, షాపింగ్ మాల్స్ వచ్చాయి. చుట్టూ పక్కల ఉండే కెమిలక్ కంపెనీల వ్యర్థాలు, ఆస్పత్రుల వ్యర్థాలు వచ్చి దుర్గం చెరువులో చేరుతున్నాయి. దీంతో దుర్గం చెరువు జలాలు ప్రమాదకరంగా మారాయి.
చెరువులోని పలు ప్రాంతాల్లో నీటి శాంపిల్స్సేకరించి టెస్ట్ చేయగా 183 రకాల సేంద్రియ సూక్ష్మ కాలుష్య కారకాలు చెరువు నీటిలో ఉన్నట్లు గుర్తించారు. నీటిలో ఫార్మాస్యూటికల్స్, హెర్బిసైడ్లు, శిలీంద్ర సంహరిణులు, పురుగు మందులు, హార్మోన్లు, స్టెరాయిడ్లు, యూవీ ఫిల్టర్లు, స్టాస్టిసైజర్లు, సైనోటాక్సిన్లు, మెటాబోలైట్లు లాంటివి ఉన్నట్లు తేల్చారు. 50శాతం ఫార్మాస్యూటికల్స్, 9 శాతం మెటాబోలైట్లు, 8 శాతం హెర్బిసైడ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మానవులు చాలా ప్రమాదకరమైన స్టడీ తెలిపింది.

దుర్గం చెరువు నీటితో భూగర్భ జలాలు కలుషితం అవుతాయని భావిస్తున్నారు. దీంతో చుట్టు పక్కల ఉన్నవారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి దుర్గం చెరువు జలాలను శుద్ధి చేయాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications