హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం: ఎలక్ట్రిక్ బైకుల షోరూమ్ లో పేలుడు; ఏడుగురు దుర్మరణం!!

|
Google Oneindia TeluguNews

సికింద్రాబాద్ లో సోమవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. సికింద్రాబాదులోని రూబీ ఫ్రైడ్ లగ్జరీ హోటల్లో సోమవారం రాత్రి భవనం కింది అంతస్తులో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ షోరూం లో పేలుడు సంభవించింది. దీంతో దట్టమైన పొగ వ్యాపించి ఊపిరాడక అదే భవనంలో పైనున్న లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు టూరిస్టులు మరణించిన విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు గా అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఎలక్ట్రిక్ బైకులు పేలి ఏడుగురు దుర్మరణం

అగ్నిప్రమాద ఘటనలో మరణించిన ఏడుగురి వయసు 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉంటుందని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ఈ హోటల్ లో దాదాపు 25 మంది ఉన్నట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న రూబీ మోటార్స్ షోరూమ్‌లో ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ లు పేలి మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. మంటలు మెట్ల పైకి వ్యాపించి, వెంటనే భవనంలోని సెల్లార్, గ్రౌండ్, మొదటి మరియు రెండవ అంతస్తులను చుట్టుముట్టాయని తెలిపారు. మంటల కంటే దట్టమైన పొగ హోటల్లో ఉన్న వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయని వెల్లడించారు.

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స

అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత కూడా దట్టమైన పొగలు తొలగి పోలేదని, అందులో ఉన్న వారి ప్రాణాలను కాపాడడం కోసం పక్కనే ఉన్న కొందరు స్థానికులు కూడా అగ్నిమాపక అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్ జైన్ మాట్లాడుతూ రాత్రి మంటలు చెలరేగడంతో రెండు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి, యశోద ఆస్పత్రికి తరలించారు. హోటల్‌లో 23 గదులు ఉన్నాయని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగి మంటలు సంభవించినప్పుడు దాదాపు 50 శాతం గదులలో పర్యాటకులు ఉన్నట్టుగా వెల్లడించారు.

సంఘటనా స్థలంలో రెస్కూ ఆపరేషన్ పర్యవేక్షించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ

సంఘటనా స్థలంలో రెస్కూ ఆపరేషన్ పర్యవేక్షించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ


సినిమాటోగ్రఫీ మంత్రి మరియు సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే సాయన్న కూడా రెస్క్యూ కార్యకలాపాలను సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. భవనంలో జి ప్లస్ ఫోర్ అంతస్థుల భవనంలో అత్యవసర నిష్క్రమణ లేకపోవడంతో, ఏడుగురు వ్యక్తులు తమను తాము రక్షించుకోవడానికి వివిధ అంతస్తుల నుండి దూకారు. కొందరు పైప్‌లైన్‌ కిందికి దిగేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక శాఖ హైడ్రాలిక్ ఎలివేటర్ ద్వారా నలుగురిని రక్షించింది. రూబీ ప్రైడ్ హోటల్‌లో ఫైర్ స్ప్రింక్లర్‌లు సరిగా పని చేయడం లేవని పోలీసులు తెలిపారు.

దర్యాప్తులో అగ్నిప్రమాదానికి గల కారణాలు బయటపడతాయి

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పేలుడు, అగ్నిప్రమాదానికి అసలు కారణమేమిటన్నది దర్యాప్తులో వెల్లడవుతుందని తెలిపారు. భవనంలో ఫైర్ స్ప్రింక్లర్లు ఉన్నప్పటికీ అవి ఆ సమయంలో పనిచేయలేదని ఫైర్ డీజీ సంజయ్ జైన్ తెలిపారు. ఇక ఈ హోటల్ లో బస చేసిన చాలామంది వ్యాపారవేత్తలు, ఉత్తర భారతీయులుగా కనిపిస్తున్నారని చెబుతున్నారు.

చాలా మందికి తీవ్ర గాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

చాలా మందికి తీవ్ర గాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

క్షతగాత్రులను గాంధీ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కాలిన గాయాలు ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక చుట్టుపక్కల భవనాలు ఉండటంతో మంటలు వ్యాపిస్తాయని ఆందోళనతో ముందుగానే పోలీసులు ఆ భవనాలను ఖాళీ చేయించారు. ప్రస్తుతం అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన వారికి 30 మంది వైద్యులు అందుబాటులో ఉండి చికిత్స అందిస్తున్నట్లు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

English summary
An massive fire accident occurred in the electric bike showroom on the ground floor of the Ruby Fried luxury hotel in Secunderabad . Due to this, seven tourists who were staying in the lodge above the same building died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X