Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం-ఇద్దరు మృతి..?-పలువురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో బుధవారం(జులై 28) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక నాసెన్స్‌ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఫ్యాక్టరీలోని రియాక్టర్లు పేలడం వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీలో ఉన్న మరో ఏడు రియాక్టర్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

massive fire at chemical factory after reactor explodes in jeedimetla hyderabad

రియాక్టర్లు భారీ శబ్దంతో పేలడంతో షిఫ్ట్‌లో ఉన్న కార్మికులంతా భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించి... ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. ప్రస్తుతం పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Recommended Video

    Usman Sagar and Hussain Sagar reservoirs were completely flooded due to the recent heavy rains

    పది రోజుల క్రితం ఇదే జీడిమెట్లలోని ఆర్ట్ ల్యాబ్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో పారిశుద్ధ్య కార్మికురాలు యశోద(40) సజీవ దహనమయ్యారు. మరో మహిళ స్వల్పంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ సాయంతో మంటలు ఆర్పిన తర్వాత యశోద మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు వారం రోజుల ముందు బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాంధీనగర్ పారిశ్రామికవాడలోనూ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా గోదాములో ఉన్న కర్రలు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+