• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చిరంజీవి ఎక్కిన విమానంలో ఆ నేతలు.. పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్

|

హైదరాబాద్ : మెగాస్టార్ ఢిల్లీ బాట పట్టారు. అయితే సైరా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన హస్తినా వెళ్లారా? లేదంటే దాని వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బుధవారం సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో సైరా సినిమా ప్రదర్శన జరగనుంది. ఆ నేపథ్యంలోనే చిరంజీవి ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఎక్కిన విమానంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఉండటం పొలిటికల్ సర్కిల్‌లో ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారనే టాక్ వినిపిస్తుండటంతో మెగాస్టార్ హస్తినా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మెగాస్టార్ ఢిల్లీ టూర్.. పరమార్థం అదేనా.. లేదంటే..!

మెగాస్టార్ ఢిల్లీ టూర్.. పరమార్థం అదేనా.. లేదంటే..!

మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీ టూర్‌కు వెళ్లడం రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. బుధవారం (16.10.2019) నాడు సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో సైరా సినిమా ప్రదర్శన ఉండటంతో ఆయన హస్తినాకు వెళ్లారనేది అసలు విషయం. అయితే చిరు ఢిల్లీ పర్యటనపై మాత్రం భిన్నరకాలుగా ప్రచారం జరుగుతోంది. సైరా సినిమా పేరుతో ఢిల్లీ వెళుతున్నప్పటికీ.. బీజేపీ పెద్దలను కలుస్తుండటం హాట్ టాపికైంది. వెంకయ్య నాయుడు నివాసంలో ప్రదర్శించనున్న సైరా సినిమా చూసేందుకు కొందరు బీజేపీ పెద్దలు కూడా వస్తున్నట్లు సమాచారం.

సీఎం కేసీఆర్ ఫామ్‌ హౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య

వెంకయ్య నివాసంలో సై సైరా.. బీజేపీ పెద్దలు కూడా వస్తారా?

వెంకయ్య నివాసంలో సై సైరా.. బీజేపీ పెద్దలు కూడా వస్తారా?

వెంకయ్య నాయుడు నివాసంలో సైరా సినిమా ప్రదర్శన సందర్భంగా చిరంజీవి ఢిల్లీ వెళ్లినప్పటికీ.. ఆ క్రమంలో జరిగిన కొన్ని పరిణామాలు చర్చానీయాంశంగా మారాయి. చిరంజీవి ఢిల్లీకి బయలుదేరిన విమానంలోనే బీజేపీ నేతలు రాంమాధవ్, సీఎం రమేశ్ ఉన్నారనే సమాచారం మరిన్ని ఊహాగానాలకు తెర లేపినట్లైంది. దాంతో చిరు హస్తినా పర్యటన రాజకీయ కోణంగా చూడాల్సి వస్తోందనే వాదనలు లేకపోలేదు. అదే క్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ తీసుకోనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటన కాస్తా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవలే ఏపీ సీఎంతో భేటీ.. ఇప్పుడేమో ఢిల్లీకి

ఇటీవలే ఏపీ సీఎంతో భేటీ.. ఇప్పుడేమో ఢిల్లీకి

సైరా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలను కలుస్తున్నారు మెగాస్టార్. ఇటీవలే తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సతీసమేతంగా కలిశారు చిరంజీవి. ఒకరికొకరు శాలువాలతో అభినందించుకున్నారు. ఆ క్రమంలో జగన్, ఆయన సతీమణి భారతి కలిసి చిరంజీవి దంపతులకు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. అందరూ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తాను నటించిన సైరా సినిమా చూడాలని జగన్‌‌ను కోరారు చిరు.

బెట్టింగ్ రాజా.. భార్యను బురిడీ కొట్టించి సొంతింట్లో చోరీ.. దసరా సెలవుల్లో పక్కా ప్లాన్

గవర్నర్‌తో భేటీ కూడా అందుకే

గవర్నర్‌తో భేటీ కూడా అందుకే

ఈ నెల 5వ తేదీన తెలంగాణ గవర్నర్ తమిళిసౌ సౌందర రాజన్‌ను కూడా చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్ భవన్‌లో జరిగిన వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దసరా నేపథ్యంలో గవర్నర్‌కు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.

ఈ నేపథ్యంలో బ్రిటీష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించి తాను నటించిన సైరా సినిమాను చూడాలని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఆమె కూడా ఓకే చెప్పారు. ఆ క్రమంలో గవర్నర్ కుటుంబం సైరా సినిమాను ప్రత్యేకంగా వీక్షించేలా ప్రసాద్ ల్యాబ్స్‌లో స్పెషల్ షో వేశారు. మొత్తానికి సైరా సినిమా పేరుతో పార్టీలకు అతీతంగా నేతలను కలుస్తున్న చిరంజీవి రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పబోతున్నారేమోననే వాదనలు లేకపోలేదు.

English summary
Megastar made his way to Delhi. But did he go to Hastina as part of the promotion of Saira Cinema? Or is there a political angle behind it? Questions arise. Hot Talk about He may met with PM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X