పాదచారులకు చుక్కలు.. వాహనదారులకు తిప్పలు.. హైదరాబాద్‌లో వ్యక్తి హల్‌చల్
హైదరాబాద్ : భాగ్యనగరం నడిరోడ్లపై అడుగుదీసి అడుగు వేయాలంటే భయం. వీపరీతమైన రద్దీ చికాకు తెప్పిస్తుంటుంది. కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్ లో రోడ్డు దాటడం మహా కష్టం. కానీ ఎర్రగడ్డ ప్రాంతంలో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. వాహనాలు స్పీడుగా వెళుతున్నా కూడా వాటి మధ్యలోకి వెళ్లడం.. మళ్లీ వెనక్కి రావడం.. అలా నానా హంగామా చేశాడు. అతడు చేసిందంతా ఫీట్లు అనుకుంటున్నారా?.. ముమ్మాటికీ కానే కాదు.
సదరు వ్యక్తి హల్‌చల్ చేయడంతో.. ఆ దారిలో వెళుతున్న వాహనదారులు సడెన్ బ్రేక్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు మధ్యలో నిలబడతాడు.. వెంటనే వెనక్కి తిరుగుతాడు. అలా చాలాసేపు వాహనదారులకు తిప్పలు పెట్టాడు. ఇక నడుచుకుంటూ వెళ్లేవారికైతే చుక్కలు చూపించాడు. వారిని వెంబడిస్తూ భయాందోళనకు గురిచేశాడు. చేతిలో కర్ర ఉండటంతో అది చూపిస్తూ నానా యాగీ చేశాడు.

ఆ వ్యక్తి వీరంగంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. సమయానికి ఆ ఏరియాలో ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో చెలరేగిపోయాడు. మొదటగా అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చివరకు ఆయనకు మతిస్థిమితం లేదని తేలింది. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి పారిపోయి ఉండొచ్చని అక్కడ ఉండే చిరువ్యాపారులు అనుమానిస్తున్నారు. మొత్తానికి అతడు చేసిన హంగామాతో చాలాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications