Rains: వచ్చే రెండు రోజులు తెలంగాణలో తేలిపాటి వర్షాలు..
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా పగటి పూట టెంపరేచర్ పెరిగే అవకాశ ఉన్న వెల్లడించింది. ఇప్పటికే చాలా చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. అటు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.1 డిగ్రీల అధికంగా 36 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది.
ప్రజలు ఉక్కపోత అల్లాడుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేకుండా ఉండలేకపోతున్నారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగింది. మరోవైపు నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైంది. సెప్టెంబర్ 30 నాటికి రుతుపనాలు వెళ్లిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈలోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఎర్పడితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఉత్తర అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. వివిధ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.












Click it and Unblock the Notifications