గుడ్ న్యూస్: ఇకనుంచి ఉదయం 6 గంటలకే మెట్రో, యువకుడి ట్వీట్, కేటీఆర్ రియాక్షన్
మెట్రో.. సుదూర ప్రాంతాలను వేగంగా చేరుకునే ప్రయాణ మార్గం. అవును.. కరోనాకు ముందు అందరూ మెట్రోనే వాడేవారు. ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు.. కానీ తక్కువ. ఎందుకంటే ఆఫీసులు తెరవలేదు. కొన్నింటినీ మాత్రమే ఓపెన్ చేశారు. సో వాటికి సంబంధించి/ కాలేజీకి వెళ్లేవారికి సంబంధించి కూడా మెట్రో వాడుతున్నారు. కానీ ఇందులో ఓ సమస్య వచ్చింది.
ఏ సమస్య అయినా ట్వీట్ చేస్తే చాలు.. మంత్రి కేటీఆర్ స్పందిస్తారు. ఈ సారి కూడా అలాగే రియాక్ట్ అయ్యారు. ఓ యువకుడి వినతిని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. వెంటనే మెట్రో సేవలను మరింత ముందుకు తీసుకొచ్చేలా చేశారు. మెట్రో రైలు సేవలు ఇక నుంచి ఉదయం 6 గంటలకే అందుబాటులోకి వస్తాయి. పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ. ఎన్వీఎస్ రెడ్డి స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు మెట్రో రైలు కష్టాలపై కొన్ని వీడియోలను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఉదయం 6 గంటలకే ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు వస్తున్నారు. సర్వీసులు 7 గంటలకు కానీ ఫ్రారంభం కావటం లేదన్నారు. అంతసేపు ప్రయాణికులు వేచి ఉండాల్సి వస్తోంది. ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకుంటే ఉదయం అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రయాణికు సౌలభ్యం కోసం ఉదయం 6 గంటలనుంచే మెట్రో రైలు సేవలను ప్రారంభించాల్సిందిగా కోరారు.
https://twitter.com/SudarsiAbhinav/status/1457520672607858699?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1457543843218219008%7Ctwgr%5E%7Ctwcon%5Es3_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelangana%2Fhyderabad-metro-rail-services-to-be-started-from-6am-306236.htmlRecommended Video
ఆ ట్వీట్ లో ఉదయం 6 గంటలకే మెట్రో స్టేషన్లలో ఉన్న ప్రయాణికుల షార్ట్ వీడియోను కూడా ప్రదర్శించాడు. దీంతో కేటీఆర్ ఆ వీడియోను సపోర్ట్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రీట్వీట్ చేశారు. ఆ సమస్య తనకు కూడా సమ్మతమేనని తెలిపారు. దీంతో ఎన్వీఎస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఉదయం సర్వీస్ వేస్తామని తెలియజేశారు. సో యువకుడి కంప్లైంట్ మేరకు మెట్రో రైలు ఎండీ స్పందించారు.












Click it and Unblock the Notifications