కేంద్ర జాతీయ అవార్డులను గెలుచుకున్న తెలంగాణ.!గర్వంగా ఉందన్న మంత్రి ఎర్రబెల్లి.!

ఢిల్లీ / హైదరాబాద్: మరోసారి తెలంగాణ గ్రామాలు అత్యుత్తమంగా నిలిచాయి. దేశానికి ఆదర్శంగా మారాయి. తెలంగాణ పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని నిరూపించాయి. కేంద్రం ప్రకటించిన మొత్తం 46 జాతీయ అవార్డుల్లో 13 అవార్డులు తెలంగాణ రాష్ట్రం గెలుచుకుంది. 8 దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు, మరో 5 నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు తెలంగాణ రాష్ట్రం సగౌరవంగా అందుకుంది.

9 కేటగిరిలలో అవార్డుల ఎంపిక జరగగా, 8 కేటగిరీ లలో అవార్డులు సాధించిన తెలంగాణను భారత రాష్ట్రపతి అభినందించారు. ఈ అవార్డులను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరిగిన పంచాయత్ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డులను రాష్ట్రపతి అందచేశారు.

Errabelli is proud of Telangana winning central national awards.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిచారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం చంద్రశేఖర్ రావు నేతృత్వంలో జరుగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను, అది సాధించిన ఫలితాలను మంత్రి ఎర్రబెల్లి వివరించారు. దేశంలో తెలంగాణ మాత్రమే కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా ఇస్తున్నదని చెప్పారు. పల్లెల్లో వినూత్నంగా సాధించిన ప్రగతిని మంత్రి తెలిపారు.

భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు తీసుకోవడం పట్ల రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అవార్డులు అందుకున్న అధికారులు, ప్రజా ప్రతినిధులకు మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అభినందనలు తెలిపారు. అవార్డులు ఇచ్చిన కేంద్రానికి, రావడానికి కారణమైన సీఎం చంద్రశేఖర్ రావుకు, సహకరించిన మంత్రులు కే టి అర్, హరీశ్ రావు లకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+