హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబానీ సంపద పెరిగితే సరిపోతుందా.. మంత్రి ఈటల మాటల తూటాలు

|
Google Oneindia TeluguNews

వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికం పోతుందా అని అడిగారు. సంపద కేంద్రీకృతం కావడమే పేదరికానికి కారణం అని వివరించారు. రవీంద్ర భారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గత కొంతకాలం నుంచి ఈటల ఇలా కామెంట్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఎలుకల బాధకు ఇంటిని తగులబెట్టుకోవద్దని సూచించారు. బాధ ఉంటే ఇలా చేయడం సరికాదని పేర్కొన్నారు. ఢిల్లీలో రైతు బాధ ఏద ఒక రోజు మనవరకు వస్తుందని చెప్పారు. తాను ఈ రోజు మంత్రిగా ఉండొచ్చు.. కానీ తాను కూడా సాధారణ మనిషినేనని చెప్పారు. మెరిట్ లేనిదే టీచర్ కాలేరని.. మెరిట్ లేకుంటే మెడికల్ సీటు కూడా రాదని చెప్పారు. అలాగే పాలించేవాడికి కూడా మెరిడ్ ఉండాల్సిందేనని చెప్పారు.

minister etela rajender hot comments

ఉద్యమాలు ప్రజల కోసం చేస్తే వారికి గొంతు కలపాలని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు మనం పనిచేయాలని కోరారు. ఓ పౌరునిగా.. సగటు మనిషిగా స్పందించాలని కోరారు. ఎర్రకోట సాక్షిగా రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నామని వివరించారు. కానీ అదీ సక్రమంగా అమలు కావడం లేదని ఈటల అనుమానం వ్యక్తం చేశారు. అందుకోసమే క్రిమిలేయర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందని చెప్పారు.

గత కొంతకాలం నుంచి ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. పార్టీ గురించి, పదవుల గురించి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సీఎం కేసీఆర్‌తో సఖ్యతగా ఉండటం లేదా అనే అనుమానం కలుగుతోంది. దానికి తగ్గట్టు ఆయన అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి సంపద గురించి.. అంబానీ గురించి కామెంట్స్ చేశారు.

English summary
telangana health minister etela rajender hot comments on mukesh ambani wealth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X