రైతుల బతుకు బుగ్గిపాలు.. బీజేపీపై మంత్రి హరీశ్ రావు విమర్శలు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. అటాక్- కౌంటర్ అటాక్ కంటిన్యూ అవుతుంది. ఏ ప్రభుత్వాలైనా ప్రజల కోసమే పని చేయాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులను రోడ్డు మీద పడేసిందని విమర్శించారు. రాష్ట్రంలో గల 70 లక్షల మంది రైతుల కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్తే... అక్కడ పెద్దలు అవమానించారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని హరీశ్ రావు విమర్శించారు. సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ లో విత్తన ధ్రువీకరణ సంస్థ కొత్త భవనం, గోదాములకు హరీశ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, జెడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు.

ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మాలని గతంలో కేంద్రం చెప్పిందని... ఇప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చేసరికి వద్దంటున్నారని హరీశ్ విమర్శించారు. ఇలాంటప్పుడు పంట పండించిన రైతులు ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు. పామ్ ఆయిల్ పంటతో ఎక్కువ లాభాలు ఉన్నాయని... రైతులు ఈ పంటను అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల దృష్టి సారించాలని సూచించారు. సిద్ధిపేట మార్కెట్ యార్డుకు రాష్ట్రంలోనే తొలి ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చిందని తెలిపారు.
ఇటు యాసంగి పంటపై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. కొనాలని రాష్ట్రం.. ఇదివరకు యాసంగి బియ్యం అప్పగించాలని కేంద్రం పరస్పర ఆరోపణలు చేస్తోంది. వరి పంట కొనుగోలు అంశానికి సంబంధించి దుమారం కొనసాగుతున్న క్రమంలో బండి సంజయ్ అటాక్ చేశారు. కేటీఆర్‌ని నాస్తికుడు అని విమర్శలు చేశారు. తీన్మార్ మల్లన్న హిమాన్షుపై కామెంట్స్ వివాదం నడుస్తోన్న వేళ.. సంజయ్ కామెంట్లపై గులాబీ దళం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలీ మరీ. ఈ లోపు హరీశ్ రావు కూడా టార్గెట్ చేశారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని వదలడం లేదు.












Click it and Unblock the Notifications