విద్యార్థులతో కేటీఆర్ చిట్ చాట్.. సాగు బడిపై ఆరా,, అగ్రిహబ్ ప్రారంభం
రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగింది. కానీ ఉత్పాదకత, ఆదాయం కూడా పెరగాల్సిన అవసరం ఉందని ఐటీ, మున్సిపల్ శాఖ కేటీఆర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన అగ్రి హబ్‌ను మంత్రులు నిరంజన్ రెడ్డి, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డికలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ సూచనలు, మార్గదర్శకత్వంలో మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయం పట్ల ప్రేమ, సాగునీటి రంగంపై ఉన్న శ్రద్ధతో ఈ ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయ, సాగునీటి రంగంలో ఏ రాష్ట్రం సాధించని అద్వితీమయమైన విజయాలను సాధించింది. ప్రపంచం అబ్బురపడే విధంగా మూడున్నరేండ్ల కాలంలో కాళేళ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కేటీఆర్ అన్నారు.

ఒడిసిపట్టి..
కృష్ణా, గోదావరి జీవనదుల్లోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి.. సాగుకు యోగక్యమైన భూమికి నీరందించేందుకు కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. పాలమూరు ఎత్తిపోతల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడేండ్లలో ధాన్యం దిగుబడి పెరిగింది. ఇవాళ తెలంగాణ ధాన్య భాండాగారంగా మారిందన్నారు. రైతులకు అండగా ఉంటున్నాం. ఒకప్పుడు మనదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో ఆహార భద్రత ఒక సవాల్‌గా ఉండేది. ఈ జనాభాకు సరిపడా ఆహారం ఉత్పత్తి చేయగలుగుతామా? అనే సందేహం ఉండేది. ఇప్పుడు ఆహార భద్రతను సాధించాం. కానీ ప్రస్తుతం పోషాకాహార భద్రత ఒక సవాల్‌గా మారింది. కొవిడ్ వ్యాపించిన తర్వాత ప్రజలందరూ న్యూట్రిషన్ ఫుడ్‌పై మక్కువ చూపుతున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

వ్యవసాయ.. అనుబంధ
ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, ప్రాఫిటబిలిటీ అనేది రైతుకు చాలా ప్రాముఖ్యమైన విషయం. దేశంలో 55 నుంచి 60 శాతం మంది జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులను తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. సబ్సిడీ మీద నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. రైతుబంధు రూపంలో ఎకరానికి రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ. 10 వేలు ఇస్తున్నాం. ప్రతి రైతుకు జీవిత బీమా చేసి రైతు కుటుంబంలో ధీమా నింపుతున్నాం. ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. గోడౌన్ల సామర్థ్యం 4 లక్షల నుంచి 26 లక్షల టన్నులకు పెరిగింది. పాలిహౌస్, మెక్రో ఇరిగేషన్‌కు సబ్సిడీ ఇస్తున్నాం.

మాటలే
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని లక్ష్యాలు, నినాదాలు అలానే మిగిలిపోతున్నాయి. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2022 కల్లా రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని నినాదం ఇచ్చారు. ఇది ఆచరణలో సఫలమైందా? ఒరిగిందా? అంటే కాలేదనే చెప్పొచ్చు. కొంత వరకు మాత్రమే జరిగింది.రైతును మించిన ఇన్నోవేటర్ లేడు. ఇన్నోవేషన్ ఎవరి సొత్తు కాదు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. అగ్రిహబ్‌లో తెలుగు భాషకు పెద్దపీట వేయాలి. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలి. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్‌ను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణలో వ్యవసాయ రంగంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.

విద్యార్థులతో ఇంటరాక్ట్..
వ్యవసాయ యూనివర్సిటీలో టీ అగ్రిహబ్ ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ విద్యార్థులతో ముచ్చటించారు. స్టాల్స్ వద్దకు మంత్రి కేటీఆర్ చేరగానే నేతలు, అధికారులు , స్టాల్స్ , సంస్థల యజమానులు వాటి గురించి వివరించేందుకు గుమిగూడారు. అప్పటికే అగ్రికల్చర్ బిఎస్సీ చదువుతున్న విద్యార్థులు పక్కన నిలబడగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని ఇక్కడ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు మాత్రమే ముందుకు రావాలి, ఈ హబ్ వారికి ఎలా ఉపయోగ పడుతుందో అంటూ, అటుగా ఉన్న విద్యార్థులను పిలిచి ప్రతి స్టాల్ వద్ద సుదీర్ఘంగా చర్చించారు .
Recommended Video

అదృష్టం
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ చేపడుతున్న ప్రతి ప్రణాళికా అందరికీ చేరాలని కేటీఆర్ అన్నారు. విద్యార్థులతో వాటి ఉపయోగాలను తెలుసుకున్నారు. అగ్రి బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న హిమబిందు మాట్లాడుతూ.. సర్ ఈ యూనివర్సిటీలో చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను, మా ప్రాంతంలో కూడా అందరూ నన్ను గౌరవంగా చూస్తున్నారు. నాన్నకు సాగులోని మెలకువలు చెబుతుంటే లోలోనే మురిసిపోతున్నారు. మా పంటలు చాలా బాగున్నాయి. మా పల్లెలో నాన్నతో పాటు సమీప రైతులంతా సాగు ముచ్చట్లు విన్నారు . తరగతి గదులకే పరిమితం కాకుండా రెండవ ఏడాది నుంచే పొలాలలో వెళ్లే పరిస్థితి కొవిడ్ కల్పించిందని మరో విద్యార్థి మంత్రి దృష్టికి తెచ్చారు. ఇలా విద్యార్థులు ఒక్కొక్కరూ ముందుకొచ్చి తమ సాగు ముచ్చట్లు చెప్పడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. మారుమూల గ్రామాల నుంచి వచ్చిన రైతు బిడ్డలే ఎక్కువగా ఉండడంతో ఇలాంటి వారి వల్లే త్వరగా రైతుకు మంచి సమాచారం, టెక్నాలజీ అందుతుందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. విద్యార్థులతో కేటీఆర్ చక్కగా ఇంటరాక్ట్ అయ్యారు. ప్రాక్టికల్‌గా సాగు బడి గురించి డిస్కష్ చేశారు.
-
KTR on Speaker Decision: దానం, కడియంకు క్లీన్ చిట్టా ? కేటీఆర్ షాకింగ్ ..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications